![Cm Revanth Reddy Tweet On Grain Procurement - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/11/CMrevanthreddy8.jpg.webp?itok=R-0RG5Dp)
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రేడర్లపై కేసులు, మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్‌కు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు.
‘‘ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు’’ అంటూ సీఎం ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment