ఏపీలో ‘రేషన్‌ డోర్‌ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం  | Karnataka Study On Ration Door Delivery In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘రేషన్‌ డోర్‌ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం 

Published Sat, Feb 5 2022 3:05 PM | Last Updated on Sat, Feb 5 2022 3:05 PM

Karnataka Study On Ration Door Delivery In AP - Sakshi

రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని అధ్యయనం చేస్తున్న కనకవల్లి

పటమట (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌డోర్‌ డెలివరీ విధానాన్ని కర్ణాటక పౌర సరఫరాల కమిషనర్‌ అధికారి కనకవల్లి అధ్యయనం చేశారు. శుక్రవారం ఆమె విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని పరిశీలించారు.

చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్‌!

పటమట భాగయ్య వీధిలో ఉన్న డిపో నం 272కు చెందిన ఎండీయూ ఆపరేటర్‌ వాహనం వద్ద డీలర్‌ నుంచి స్టాకు ఎండీయూ ఆపరేటర్‌కు బదలాయింపు, ఆపరేటర్‌ నుంచి కార్డుదారులకు రేషన్‌ ఎలా ఇస్తున్నారనేది పరిశీలించారు. ఈ విధానంపై స్థానికుల నుంచి అభిప్రాయసేకరణ చేశారు. డోర్‌ డెలివరీపై ఆమెకు ఏఎస్‌వో సర్కిల్‌–2 కోమలి పద్మ, ఏపీ పౌర సరఫరాల కమిషనరేట్‌ అధికారులు పలు వివరాలు చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement