karnataka governement
-
Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త!
కర్నాటక ప్రభుత్వం అల్ట్రాస్కానింగ్ గదిలోకి గర్భిణులతోపాటు వచ్చే అటెండర్స్ను నిషేధిస్తూ సర్క్యులర్ తెచ్చింది. ప్రతి తల్లి తన కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్లైనా మగపిల్లాడైనా కనడానికి సిద్ధంగా ఉంటుంది. కాని అటెండర్స్ రూపంలో వచ్చే అయినవాళ్లు అల్ట్రాస్కానింగ్ని వీడియో తీసి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. తర్వాత అబార్షన్ చేయిస్తున్నారు. ఇలా ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదో. కర్నాటక మేలుకొంది. ఆ రాష్ట్రం తీసుకున్న మరిన్ని జాగ్రత్తలు..హర్యాణలోని జాట్ కుటుంబంలో యోగ్యుడైన వరునికి తగిన వధువు కోసం 3000 కిలోమీటర్ల దూరంలో కూడా వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నా కానీ ఆడశిశువుల భ్రూణ హత్యల విషయంలో మనలో మార్పు రావడం లేదు. 2000 సంవత్సరం నుంచి 2019లోపు మన దేశంలో 90 లక్షల మంది ఆడపిల్లలు భ్రూణ హత్యల ద్వారా పుట్టకుండానే మరణించారని ఒక అధ్యయనం చెబుతోంది.2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్, హర్యాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో 120 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలే ఉన్నారు. లెక్కలు ఇంత భయపెడుతున్నా నేటికీ ఒడిశా, కర్నాటక రాష్ట్రాలలో లింగ నిర్థారణ జరిపించి మరీ ఆడపిల్లలను ఛిద్రం చేస్తూనే ఉన్నారు. తాజాగా కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఈ రాకెట్ ఒకటి బట్టబయలు కావడంతో ప్రభుత్వం మేల్కొని కొత్త నియమ నిబంధనలు తెచ్చింది.చట్టం ఉన్నా...ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయగ్నొస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) యాక్ట్ 1994 (లింగ నిర్థారణ నిషేధ చట్టం) కింద లింగ నిర్థారణ చేయించేవారికి గరిష్టంగా 5 సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉన్నా కొందరు ఎప్పటికప్పుడు దొంగదారులు కనిపెడుతూనే ఉన్నారు. ఇటీవల కర్నాటకలో లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలులో భాగంగా రేడియాలిజిస్ట్లు, గైనకాలజిస్ట్‌లతో ఒక వర్క్‌షాప్ జరిగినప్పుడు వారు కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.– పేషెంట్లతోపాటు అటెండర్ల పేరుతో బంధువులు లోపలికి వస్తున్నారు.– అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ను తమ మొబైల్ కెమెరాలలో బంధిస్తున్నారు.– సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలలో లింగ నిర్థారణ నేరం కాదు.– కొందరు ఒక రాకెట్లాగా ఏర్పడి ఆ వీడియోలను ఈ దేశాలలోని వైద్యులకు పంపి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. ఆ తర్వాత అబార్షన్లు చేయిస్తున్నారు.తాజాగా మాండ్యాలో ఇలాంటి రాకెట్‌ను పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం వెంటనే కొత్త సర్క్యులర్ జారీ చేసింది.ఇతరులు రాకూడదు..– అల్ట్రాసౌండ్ గదిలోకి గర్భిణితోపాటు ఇకపై అటెండర్లు రాకూడదు. వారికి ప్రవేశం లేదు.– గర్భిణి తన ఆల్ట్రాసౌండ్ పరీక్షను గమనించేలాగా గతంలో అడిషనల్ స్క్రీన్ గదిలో ఉంచేవారు. ఇకపై ఆ స్క్రీన్ ఉండదు. అంటే గర్భిణి తన అల్ట్రాసౌండ్ పరీక్షను చూడటానికి అనుమతి లేదు. ఎందుకంటే కొందరు రేడియాలజిస్ట్‌లు డబ్బుకు కక్కుర్తి పడి ఒక మాట గాని, చర్యగాని లేకుండా గర్భిణులకు అర్థమయ్యేలా పాయింటర్‌తో చూపుతున్నారు.ఆడపిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తున్నా, ఉపాధి అవకాశాలు పొందుతున్నా, క్రీడల్లో పతకాలతో మెరుస్తున్నా, రాజకీయ పదవులు పొందుతున్నా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా ఇంకా ‘కొడుకు’ కావాలనే కోరిక చాలామంది తల్లిదండ్రులను పీడిస్తోంది. ఆ భావజాలం నుంచి కొద్దిగా బయటడినా చాలామంది ఆడపిల్లలు బతికి΄ోతారు. బంగారు దేశాన్ని నిర్మిస్తారు.ఇవి చదవండి: Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు! -
హిజాబ్‌పై నిషేధం సబబే!
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద కుట్రకు తెరతీసిందని ఆరోపించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషిన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ సాగింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అనంతరం ముస్లిం పిటిషనర్ల తరఫున దుష్యంత్ దవే..‘హిజాబ్‌పై నిషేధంతో దేశంలోని మైనారిటీల మత విశ్వాసాన్ని దెబ్బతీసింది. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లింది’అని పేర్కొన్నారు. హిజాబ్ వంటి మతాచారాలు అత్యవసరమైనవి కాకపోయినా, ఒక వ్యక్తి నచ్చిన వాటిని ఆచరించే క్రమంలో కోర్టులు, యంత్రాంగం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఇదీ చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు -
మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్
బెంగళూరు: మత మార్పిడుల నిరోధక బిల్లుకు శాసన మండలి మద్దతు లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో మత మార్పిడులను అరికట్టడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కర్ణాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక అసెంబ్లీలో ఆమోదం పొందింది. శాసన మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో ఉండిపోయింది. మండలిలో అధికార బీజేపీకి తగిన మెజార్టీ లేకపోవడమే ఇందుకు కారణం. బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం చివరకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయానికొచ్చింది. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్ మచాడో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయొద్దంటూ కర్ణాటక గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. ఆర్డినెన్స్ ఆలోచన చాలా బాధాకరమని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ను అసెంబ్లీలో క్రైస్తవ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. -
హిజాబ్ వ్యవహారం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొంది. రేపు(సోమవారం) నుంచి ఈ నెల 19 వరకు ఉడిపిలో 144 సెక్షన్ అమలు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను ఈ నెల16 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఉడిపి డిప్యూటీ కమిషనర్ కూర్మారావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల వద్ద 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. -
ఏపీలో ‘రేషన్ డోర్ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం
పటమట (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌డోర్ డెలివరీ విధానాన్ని కర్ణాటక పౌర సరఫరాల కమిషనర్ అధికారి కనకవల్లి అధ్యయనం చేశారు. శుక్రవారం ఆమె విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని పరిశీలించారు. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! పటమట భాగయ్య వీధిలో ఉన్న డిపో నం 272కు చెందిన ఎండీయూ ఆపరేటర్ వాహనం వద్ద డీలర్ నుంచి స్టాకు ఎండీయూ ఆపరేటర్‌కు బదలాయింపు, ఆపరేటర్ నుంచి కార్డుదారులకు రేషన్ ఎలా ఇస్తున్నారనేది పరిశీలించారు. ఈ విధానంపై స్థానికుల నుంచి అభిప్రాయసేకరణ చేశారు. డోర్ డెలివరీపై ఆమెకు ఏఎస్వో సర్కిల్–2 కోమలి పద్మ, ఏపీ పౌర సరఫరాల కమిషనరేట్ అధికారులు పలు వివరాలు చెప్పారు. -
కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం
Karnataka Issues High Alert : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. జిమ్ చేస్తుండగా గురువారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పునీత్ తుదిశ్వాస విడిచారు. అయితే పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆసుపత్రికి చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ రాజ్‌కుమార్ మృతికి సంతాప సూచకంగా సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. -
కూలీ ఎక్కడైతే అక్కడే స్కూలు
భవన నిర్మాణ వలస కూలీలుగా వెళ్లడం అంటే ఉద్యోగంలో బదలీ మీద వెళ్లడం లాంటిది కాదు. పని తప్ప అక్కడ ఏమీ ఉండదు. పిల్లలకు బడి ఉండదు. చంటి పిల్లలకు అమ్మ ఒడి అందుబాటులో ఉండదు. భద్రంగా ఒక ఇల్లు ఉండదు. పెద్దవాళ్లు పని చేస్తున్నంత కాలం.. పని చేస్తున్నంత సేపూ.. పిల్లలు అలా గాలికి, ధూళికీ ఆ కొత్త ప్రదేశంలో.. కొత్త వాతావరణంలో అలా తిరుగుతుండవలసిందే. అలాంటి వాళ్ల సంరక్షణ కోసం ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఇండియా అంటేనే నిర్మాణాలు జరిగే దేశం. ఈ మాట ఎక్కడో మీరు వినే ఉంటారు. వినడం ఏముందీ, నిత్యం ఎక్కడో ఒకచోట నిర్మాణాలు జరుగుతుండమూ మీరు చూస్తూనే ఉంటారు. అయితే ఈ నిర్మాణాల దేశంలో బాలల భవిష్యత్తును నిర్మించే పనే.. భవన నిర్మాణాలంత భద్రంగా, వేగంగా జరగడం లేదన్నది నిజం! ఇందుకు పెద్దపెద్ద నిదర్శనాలు అక్కర్లేదు. భవన నిర్మాణాల కార్మికులను చూస్తే చాలు. ఉన్న ఊరిని వదిలేసి, పని వెతుక్కుంటూ పిల్లల్ని చంకనేసుకుని మహా నగరాలకు చేరుకుంటారు. ఆ కట్టడాలు పూర్తయ్యే వరకు.. ఆ కంకర, ఇటుకలు, సిమెంటు మధ్యనే వారి నివాసం. నిర్మాణానికి ఓ పక్కన గుడారం వేసుకుని ఎండకు, వానకు, చలికి ఆ గుడారాల్లోనే ఉంటారు. పగలంతా సైట్లో రెక్కలు ముక్కలు చేసుకోవడం, రాత్రవగానే అక్కడే ఓ మూల పిల్లల్ని పక్కలో వేసుకుని తలదాచుకోవడం. మరి ఇటుకలు మోస్తున్నప్పుడు, తడి కంకర స్లాబు పైకి చేరుస్తున్నప్పుడు, బేల్దారి పర్యవేక్షణలో తల తిప్పేందుకైనా వీలు చిక్కని పనిలో ఉన్నప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఎక్కడుంటారు? అక్కడే ఒక చోట ఆడుకుంటూ ఉంటారు. వారు ఆడుకునే పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. ప్రమాదరహితంగా ఉండవు. అంతకన్నా కూడా.. భద్రంగా అసలే ఉండవు. పని జరిగే చోటే క్రెచ్‌లు బడిలో వదిలేస్తేనన్నా వాళ్ల గురించి చింత ఉండదు. కానీ ఈ కూలీలేమైనా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఉద్యోగులా.. అక్కడి స్కూల్లో టీసీ తీసుకుని వచ్చి ఇక్కడిస్కూల్లో చేర్పించడానికి?! ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇంకో ఇంకో రాష్ట్రం అయినా దేశం మొత్తమీద రాష్ట్ర రాజధానులకు వలస వచ్చి నెలలకు నెలలు ఉండిపోయే వలస కార్మికులు లక్షల సంఖ్యలోనే ఉంటారు. వారి పిల్లలందరూ నిర్మాణాలు పూర్తయ్యేవరకు తల్లిదండ్రుల కనుసన్నలలో ఆ చుట్టుపక్కలే గాలిలో గాలిగా, ధూళిలో ధూళిగా ఉండవలసిందే. ఇప్పుడు ఇలాంటి పిల్లల కోసం కర్ణాటక కార్మిక శాఖ ప్రత్యేక శ్రద్ధను తీసుకుని తల్లి ఒడిలాంటి రక్షణను, శిక్షణను ఇవ్వబోతోంది! బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్, కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థలలో కాలం తీరిన కారణంగా షెడ్డులలో పడి ఉన్న బస్సులను నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి వాటిని పునరుద్ధరించి, మొబైల్ క్రెచ్‌లుగా తీర్చిదిద్దబోతోంది. ఆ క్రెచ్‌లు.. నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల దగ్గర వలస కార్మికుల పిల్లల కోసం నగరమంతటా తిరుగుతుంటాయి. క్రెచ్‌ల లోపల పిల్లలకు ఇష్టమైన తినుబండారాలు, పిల్లలకు నచ్చే ఆటబొమ్మలు, కథల పుస్తకాలు ఉంటాయి. క్రెచ్ వాహనాలపై రంగు రంగుల పెయింటింగులతో పూల బొమ్మలు, పక్షుల బొమ్మలు, మనుషుల బొమ్మలు ఉంటాయి. క్రెచ్ లోపల తాగేందుకు పరిశుభ్రమైన నీరు ఉంటుంది. తినుబండారాలు కూడా ఎదిగే వయసులో పిల్లలకు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి! ఈ ఏర్పాటు వల్ల పిల్లలు స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణంలో ఉంటారు. వేళకు ఆహారం ఉంటుంది. బుద్ధీ వికసిస్తుంది. పిల్లలు తమ కళ్లెదుటే మంచి స్కూలు లాంటి పరిసరాలలో ఉన్నారన్న నిశ్చింత వారి తల్లిదండ్రులకూ ఉంటుంది. దీపావళికి ముందే వెలుగు క్రెచ్‌ల ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యులు జి.చంద్రశేఖర్ ఎంపీ నిధుల నుంచి ఇప్పటికే 25 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ డబ్బును బస్సులు కొనడానికి, వాటిని బాగు చేసుకోసుకుని పిల్లలకు ఇష్టమయ్యేలా మలచడానికి ఉపయోగిస్తారు. తర్వాత వాటిని ఎన్జీవో సంస్థలకు అప్పగిస్తారు. ప్రధానంగా బెంగళూరుతో పాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ క్రెచ్‌ల తయారీ కోసం కర్ణాటక ప్రధాన కార్యదర్శి టి.ఎం. విజయ భాస్కర్ తొలి విడతగా వంద బస్సుల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. దీపావళి లోపు ఈ క్రెచ్‌లను ఆరంభించేందుకు అధికార యంత్రాంగం త్వర త్వరగా పనులు పూర్తి చేస్తోంది. పెద్దవాళ్లు వర్తమాన భారతాన్ని నిర్మిస్తుంటే.. వాళ్ల పిల్లల్ని భావితరం నిర్మాతలుగా మలిచేందుకు జరుగుతున్న ఈ కృషి ముందు.. ఎంత భారీ ప్రాజెక్టు నిర్మాణం అయినా కూడా చిన్నదిగానే కనిపిస్తుంది. -
కొత్త ఏడాదిన రాష్ట్ర ప్రభుత్వం షాక్
సాక్షి బెంగళూరు: కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు హెచ్డీ.కుమారస్వామి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకపు పన్నును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి లీటరు పెట్రోల్‌పై 3.27 శాతం, డీజిల్‌పై 3.27 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి పెట్రోల్‌పై 28.75 శాతం, డీజిల్‌పై 17.73 శాతం మేర అమ్మకపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే ప్రస్తుత పెంపు నేపథ్యంలో అమ్మకపు పన్ను పెట్రోల్‌పై 32 శాతం, డీజిల్‌పై 21 శాతానికి చేరుకుంది. అమ్మకపు పన్ను పెంపు వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఒక రూపాయిమేర మార్పు కనిపించనుంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచుతూ ఆదేశాలు జారీచే యడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో కర్ణాటకలో శుక్రవారం పెట్రోల్ ధర 69.01 ఉండగా పెంపు తర్వాత రూ. 70.35కు చేరుకుంంది. అలాగే డీజిల్ కూడా రూ. 62.80 ఉండగా.. అది కాస్తా 64.13కు చేరుకుంది. ప్రతి లీటరు పెట్రోల్ రూ.70.35, డీజిల్ రూ.69.21 మేర «లభించనున్నాయి. రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.46 వేల కోట్లు రైతుల రుణమాఫీకి హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన లోటును పూరించుకునేందుకు పెట్రోల్, డీజిల్ అమ్మకపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుందని అందరూ భావిస్తున్నారు. -
గౌరీ లంకేశ్ హంతకుల గుర్తింపు?
-
గౌరీ లంకేశ్ హంతకుల గుర్తింపు?
సాక్షి, బెంగళూర్ : సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితులను గుర్తించామని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో తెలిపారు. హంతకులెవరో మాకు తెలుసు. త్వరలో అన్ని విషయాలను వెల్లడిస్తాం అని ఆయన చెప్పారు. అయితే అందుకు సంబంధించి సరైన సాక్ష్యాలను సేకరించే పనిలో సిట్ బిజీగా ఉందని, ప్రస్తుతానికి మిగతా విషయాలను మీడియాకు వెల్లడించటం కష్టమని రామలింగా రెడ్డి చిక్ బల్లాపురాలో విలేకరులతో చెప్పారు. అదే సమయంలో సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించటంతో ఆసక్తికర చర్చ మొదలైంది. సెప్టెంబర్ 5న తన ఇంటి వద్ద గౌరీ లంకేశ్‌ను దుండగలు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసింది అతివాద హిందుత్వవాద సంఘమని పలువురు ఆరోపిస్తుండగా.. నక్సలైట్ సంఘాల పని అయి కూడా ఉండొచ్చన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నిందితుల ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించటంతోపాటు ఇంటెలిజెన్స్ ఐజీపీ బీకే సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. -
జయ కేసుపై సుప్రీంకు..
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని సీఎం తనకు సూచించినట్లు భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. న్యాయశాఖ, ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) బీవీ ఆచార్య, అడ్వొకేట్ జనరల్ ఇప్పటికే అప్పీలుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. సుప్రీంలో కూడా ఎస్‌పీపీగా ఆచార్య కొనసాగుతారని వివరించారు. 19 ఏళ్లపాటు సాగిన ఈ కేసులో కర్ణాటక హైకోర్టు మే 11న జయను నిర్దోషిగా ప్రకటించడంతో అదేనెల 23న ఆమె మళ్లీ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూడా కర్ణాటకపై ఒత్తిడి తెచ్చింది. తీర్పును సవాలు చేయాలని కర్టాటక తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్, పీఎంకేలు ఆహ్వానించాయి. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇలగోవన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఇంతకుముందే తీసుకుంటే జయ సీఎం పగ్గాలు చేపట్టేవారు కాదని పీఎంకే అధినేత ఎస్.రాందాస్ వ్యాఖ్యానించారు.