సీఎం సొంత నియోజకవర్గంలో వినూత్న ప్రయోగం
జగదేవ్‌పూర్: గజ్వేల్...కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. కేసీఆర్ మదిలో మెదిలే ఆలోచనలన్నీ ఇక్కడి నుంచే కార్యరూపం దాల్చుతాయి. సాగు పద్ధతులే కాదు..అన్నింటా సరికొత్త విధానాలు ఉండాలని కేసీఆర్ భావిస్తుంటారు. కేసీఆర్ నయా ట్రెండ్‌ను ఫాలో అయిన గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం పిటి వెంకటాపూర్ డీలర్ మహేందర్‌రెడ్డి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కార్డుదారులెవరూ రేషన్‌దుకాణాల ముందు బారులు తీరకుండా రేషన్ సరకులను కార్డుదారుల ఇంటికే డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయాన్ని గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటీ (గడా) ఓఎస్‌డీ హన్మంతరావు, సివిల్ సప్లయ్ డివిజన్ అధికారి ఆనందరావులకు తెలిపారు. వారి అనుమతితో ఈ ప్రయోగాన్ని సోమవారం ప్రారంభించారు. గ్రామంలోని 147 మంది కార్డుదారుల ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గడా ఓఎస్‌డీ హన్మంతరావు మాట్లాడుతూ, రేషన్ సరుకులను కార్డుదారుల ఇళ్లకే వెళ్లి ఇవ్వడం మంచిదైనప్పటికీ, కొంచెం ఖర్చు కూడా ఉంటుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందన్నారు.
రేషన్.. డోర్ డెలివరీ..!
Published Tue, Nov 18 2014 1:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement