‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’ | Meenakshi Lekhi Denies Answering In Parliament Question On Hamas | Sakshi
Sakshi News home page

‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’

Published Sat, Dec 9 2023 3:42 PM | Last Updated on Sat, Dec 9 2023 6:32 PM

Meenakshi Lekhi Denies Answering In Parliament Question On Hamas - Sakshi

సాక్షి, ఢిల్లీ: హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా ప్రకటించినట్లు వెలుగులోకి వచ్చిన విషయంపై కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ స్పందించారు. హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా గు​ర్తిస్తున్నారా? అంటూ పార్లమెంట్‌లో ప్రశ్నగా ఉన్న పేపర్‌కు సమాధానంగా తాను ఎటువంటి సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ‘స్టార్‌ గుర్తు లేని’ ప్రశ్నకు కేంద్ర మంత్రి మీనాక్షీ సమాధానం ఇచ్చినట్లు లిఖితపూర్వకమైన పత్రం ఒకటి సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. 

‘అది సరైన సమాచారం కాదు. నేను ఎటువంటి ప్రశ్నకు సంబంధించిన పత్రాలపై సమాధానంగా సంతకం చేయలేదు’ అని స్పష్టం చేస్తూ.. కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌, ప్రధాని నరేంద్రమోదీకి ‘ఎక్స్‌’లో ట్యాగ్‌ చేశారు. అయితే తాను ఈ విషయంపై అధికారికంగా దర్యాప్తు చేపడతామని, దర్యాప్తులో అసలు దోషి ఒవరో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు.  

అయితే, కేంద్ర మంత్రి మీనాక్షీ క్లారిటీపై శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ‘ఈ విషయంలో ఫోర్జరీ జరిగి ఉంటుందని మీనాక్షీ భావిస్తున్నారా? అదే నిజమైతే. ఇది తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’ అని అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement