question & answers
-
Viral: ఆమె వల్లే భారత్-పాక్ గొడవ!!
విద్యార్థులు జవాబు పత్రాల్లో సరదగా చిత్ర విచిత్రమైన సమాధానాలు రాస్తూ కాలేజీ, లెక్చరర్ల దృష్టిలో పడుతూ ఉంటారు. ప్రశ్న పత్రంలో అడిగిన ప్రశ్నకు బదులు ఫన్నీ జవాబు రాసి వైరల్‌గా మారిన సంఘటనలు కూడా చాలానే చూశాం. అయితే తాజాగా ఇటువంటి సరదా ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లోని దోల్పూర్ జిల్లాలో ఓ కాలేజీ పొలిటికల్ సైన్స్ పరీక్షలో భాగంగా ప్రశ్నపత్రంలో భారత్‌కు పాకిస్తాన్ మధ్య ఏ బార్డర్ (హిందిలో ‘సీమా’) ఉంటుంది? దాని పొడవు ఎంత? అని ఉంది. దీంతో ఓ విద్యార్థి తన చిలిపితనానికి పని చెప్పాడు. ‘సీమా’ పేరుతో తన క్లాస్‌లో ఓ ఆమ్మాయి ఉండటంతో.. భారత్-పాక్ మధ్య బోర్డర్‌గా‘సీమా హైదర్’ ఉంది. అంతే కాదు ఆమె ఎత్తు 5 అడుగలు 6 ఇంచులు కూడా ఉందని రాశాడు. Question - Bharat aur Pakistan ke bich kaun si seema hai, lambai batao? Answer - Dono desho ke bich Seema Haider hai, uski lambai 5 ft 6 inch hai, dono desho ke bich isko lekar ladai hai. pic.twitter.com/25d5AvUlwl — Narundar (@NarundarM) December 21, 2023 అక్కడిదాగా బాగానే ఉన్న.. భారత్- పాక్ దేశాల మధ్య సీమా హైదర్ 5 అడుగుల 6 ఇంచుల ఎత్తులో ఉండటం వల్ల ఆమె కోసమే రెండు దేశాలు గొడవ పడుతున్నాయి అంటూ ఫన్నీగా ఆన్సర్ రాశారు. దీనికి సంబంధించి జవాబు పత్రాన్ని ఓ ఎక్స్(ట్వీటర్) యూజర్ పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అతను వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్’, ‘అతను రాసిన జవాబుకు ఒక మార్క్ ఎక్స్ట్రాగా వేయాలి’, పేపర్‌పై ఇన్విజిలేటర్ సంతకం లేదని.. అది నకిలీ పేపర్’ అని నెటజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
పెట్టుబడులను ఎప్పుడు మార్చుకోవాలి?
మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను ఎటువంటి సందర్భాల్లో మార్చుకోవాలి? – సుఖ్‌దేవ్ భాటియా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవన్నీ మారిపోయినట్టయితే పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ ఈక్విటీలు అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కలి్పంచుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకూడదు. ఇందుకోసం అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు మంచి పెట్టుబడుల అవకాశాలు అవుతాయి. తక్కువ రేట్లకే కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లలో దిద్దుబాట్లకు భయయపడి, మరింత పడిపోతాయేమోనన్న ఆందోళనతో పెట్టుబడి పెట్టకుండా ఉంటే, మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’
సాక్షి, ఢిల్లీ: హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా ప్రకటించినట్లు వెలుగులోకి వచ్చిన విషయంపై కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ స్పందించారు. హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా గుర్తిస్తున్నారా? అంటూ పార్లమెంట్లో ప్రశ్నగా ఉన్న పేపర్‌కు సమాధానంగా తాను ఎటువంటి సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ‘స్టార్ గుర్తు లేని’ ప్రశ్నకు కేంద్ర మంత్రి మీనాక్షీ సమాధానం ఇచ్చినట్లు లిఖితపూర్వకమైన పత్రం ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. You have been misinformed as I have not signed any paper with this question and this answer @DrSJaishankar @PMOIndia https://t.co/4xUWjROeNH — Meenakashi Lekhi (@M_Lekhi) December 8, 2023 ‘అది సరైన సమాచారం కాదు. నేను ఎటువంటి ప్రశ్నకు సంబంధించిన పత్రాలపై సమాధానంగా సంతకం చేయలేదు’ అని స్పష్టం చేస్తూ.. కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్రమోదీకి ‘ఎక్స్’లో ట్యాగ్ చేశారు. అయితే తాను ఈ విషయంపై అధికారికంగా దర్యాప్తు చేపడతామని, దర్యాప్తులో అసలు దోషి ఒవరో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. In the tweet below, - Meenakshi Lekhi ji is denying&disassociating to a response attributed to her - says has no idea who drafted this as response to a PQ since she didn’t sign it - is she then claiming it is a forged response, if yes this is a serious breach and violation of… pic.twitter.com/4mNscaFhpA — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) December 9, 2023 అయితే, కేంద్ర మంత్రి మీనాక్షీ క్లారిటీపై శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ‘ఈ విషయంలో ఫోర్జరీ జరిగి ఉంటుందని మీనాక్షీ భావిస్తున్నారా? అదే నిజమైతే. ఇది తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’ అని అన్నారు. -
ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా?
ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష లోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదు. అయినా ఈ లాభాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాలా? – వివేక్ మీరు పన్ను రిటర్నులను నిబంధనల ప్రకారం దాఖలు చేయాల్సి ఉంటే, అందులో లాభ, నష్టాలను వెల్లడించాలి. స్టాక్స్, లేదా ఈక్విటీ మ్యూచుల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చేవి దీర్ఘకాల లాభాలు. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో మూలధన లాభాల పన్ను వివరాలు ఉంటే, అవి పన్ను రిటర్నుల్లో ముందుగానే నింపి ఉంటాయి. ఒకవేళ మీ ఆదాయం బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటే, అప్పుడు మీరు రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. 60 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.3 లక్షలు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలుగా ఉంది. మరింత వివరంగా అర్థం చేసుకునేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ పొందొచ్చు. అప్పుడు పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటిందని అనుకుంటే, అప్పుడు రిబేట్ వర్తించదు. అప్పుడు సాధారణ శ్లాబు రేటు ప్రకారం పన్ను వర్తిస్తుంది. అలాగే, పన్ను వర్తించే ఆదాయం ఉంది కనుక రూ.లక్షకు మించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. ఒకవేళ మీ వార్షిక ఆదాయం బేసిక్ పరిమితి లోపే, రూ.2 లక్షలుగానే ఉందని అనుకుందాం. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష మించినప్పుడు.. రూ.50వేల మొత్తాన్ని బేసిక్ పరిమితి కింద మిగిలి ఉంది కనుక చూపించుకోవచ్చు. అన్ని కేసుల్లోనూ దీర్ఘకాల మూలధన లాభాల వివరాలను రిటర్నుల్లో చూపించాల్సిందే. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌కు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం) ప్రయోజనాన్ని తొలగించారని తెలిసింది. నూతన చట్టం అమలుపై స్పష్టత ఇవ్వగలరా? – గణేశన్ ఈ ఏడాది మార్చి 31 వరకు చేసే పెట్టుబడులకు లాభాల్లో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించే ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నాన్ ఈక్విటీ ఫండ్స్ పన్ను నిబంధనల్లో మార్పులు చేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించింది. దీంతో ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారనే దానితో సంబంధం లేకుండా.. డెట్ ఫండ్స్‌లో వచ్చే లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నూతన నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే పెట్టుబడులకే అమలవుతుంది. దీనికంటే ముందు చేసే పెట్టుబడులకు ఇండెక్సేషన్ ప్రయోజనం వర్తిస్తుంది. ఇదీ చదవండి: ICICI Pru Gold: అదనపు రాబడికి బంగారం లాంటి పథకం.. -
పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?
నేను ఒక కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాను. నా సోదరి వివాహం కోసం నా పీఎఫ్ ఫండ్‌ను వాడుకోవాలని అనుకుంటున్నాను. నా సందేహం ఏమిటంటే.. నేను కరోనా లాక్డౌన్ల సమయంలో ఒకసారి పాక్షికంగా ఉపసంహరించుకున్నాను. కనుక మరోసారి పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చా? పన్ను పడుతుందా? – వేణు ఉదత్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రెండు సార్లు ఉపసంహరించుకోవచ్చు. పన్నుల అంశానికంటే ముందు తెలుసుకోవాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో పీఎఫ్ నుంచి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపు, కొన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సా వ్యయాల చెల్లింపులకు, వివాహం లేదా పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్కు ఏడాది ముందు సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు. (ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!) ఈ ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ఈపీఎఫ్‌వో సభ్యుడు నిర్ణీత సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సభ్యుడు/సభ్యురాలి వివాహం కోసం లేదంటే కుమార్తె, కుమారుడు, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలంటే కనీసం ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. ఉద్యోగి వాటా కింద జమ అయి, దానికి వడ్డీ చేరగా సమకూరిన మొత్తం నుంచి 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ అవసరాల కోసం మూడు సార్లు ఉపసంహరణకు అనుమతిస్తారు. మీరు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక మీరు చేసే ఉపసంహరణలపై పన్ను ఉండదు. మీ సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు. కనుక కనీసం ఏడేళ్ల సర్వీసు ఉండాలి. మీకు ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉంది. ఏడేళ్లు పూర్తి కాకుండా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతుంది. గతంలో మీరు కోవిడ్ సమయంలో చేసిన ఉపసంహరణ ప్రభావం తాజా ఉపసంహరణలపై ఉండదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మార్చుకోవచ్చా..? – రాజేష్ షా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ మూడేళ్ల తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఈ లాకిన్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ఒక సంస్థ నుంచి ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడిని మరోసంస్థకు చెందిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మార్చుకోవాలంటే ముందుగా ఉపసంహరించుకోవాలి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ వరకు ఉపసంహరించుకోలేరు. (ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?) మూడేళ్లు నిండిన తర్వాత అప్పుడు మీ పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు నచ్చిన పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ కానీ, మరే ఇతర పన్ను ఆదా పథకాలు అయినా తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తుంటాయి. కనుక లాకిన్ సమయంలో ఉపసంహరణలను అనుమతించరు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! -
సమంతకు ఇన్‌స్టా యూజర్ తిక్క ప్రశ్న.. రీ ప్రొడ్యూస్‌ను గూగుల్ చేసి చూడాలా ?
స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన శాకుంతలం ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది సామ్. తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్ పేజీలో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్‌ను నిర్వహించింది సమంత. ఈ సెషన్ ఎంతో విచిత్రంగా సాగింది. ఇందులో నెటిజన్లు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలిచ్చింది. 'మీ పనులు చేయడానికి ఇంత ధైర్యం ఎలా వస్తుంది' అని ఒక ఇన్‌స్టా యూజర్ అడిగిన ప్రశ్నకు 'అతిపెద్ద కష్టాలను ఎదుర్కొన్నప్పుడే గొప్ప ధైర్యం వస్తుంది' అని రిప్లై ఇచ్చింది సామ్. అలాగే ఒక వ్యక్తి 'మీ ప్రతిరూపానికి పురుడు పోశారా? ఎందుకంటే మీ వంటివారిని మరొకరిని తయారు చేయాలనుకుంటున్నాను (ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ)' అని క్వశ్చన్ చేశాడు. ఆ ప్రశ్నకు సమంత అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది. ఇంతకూ ‘రీ ప్రొడ్యూస్’ను ఒక వాక్యంలో ఎలా ఉపయోగిస్తారు? దానిని ముందుగా గూగుల్ చేసి చూడాలా? అని కౌంటర్ వేసింది. మరో యూజర్ యంగ్ జనరేషన్ కోసం ఇచ్చే సలహా ఏంటీ అని అడగ్గా 'విరామం తీసుకోండి. డోంట్ బర్న్ అవుట్' అని బదులిచ్చింది. (చదవండి: దేవకన్యలా సమంత.. శాకుంతలం ఫస్ట్‌లుక్ వచ్చేసింది) అలాగే ఒక నెటిజన్ భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందా అని సామ్‌ను ప్రశ్నించగా 'నేను చాలా ఆలస్యంగా నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడూ ఏది చెప్పకూడదు అని', 'అంతిమ లక్ష్యం ఏంటని అడిగిన' ప్రశ్నకు 'గుర్తుంచుకోవడం' అంటూ సమాధానాలు ఇచ్చింది. 'మీరు నెంబర్ గేమ్ #1 హీరోయిన్' అని నమ్ముతున్నారా అనే ప్రశ్నకు 'కాదు. నెంబర్ వన్ కంటే స్థిరంగా ఉండాలి' అని రిప్లై ఇచ్చింది సామ్. -
Coronavirus: కరోనా మళ్లీ సోకుతోంది.. కారణాలేంటి?
ఇప్పటికే కరోనా వచ్చిపోయిన వారికి కూడా ఇప్పుడు మళ్లీ పాజిటివ్ వస్తోంది. దీంతో ఇలా అందరికీ వస్తుందా? కోవిడ్ మళ్లీ సోకితే ఏం చేయాలి? వ్యాక్సిన్ వేసుకున్నా వస్తుందా? ఇలా జరిగితే ఏదైనా ప్రమాదం ఉంటుందా? అన్న సందేహాలు వస్తున్నాయి. వాటికి వైద్య నిపుణుల సమాధానాలు, వారి స్వీయ అనుభవాలు మీకోసం.. కరోనా మళ్లీ సోకుతోంది.. కారణాలేంటి? ‘‘సెకండ్ వేవ్‌లో కరోనా వచ్చిన వారిలో 4.5 శాతం మంది రెండోసారి సోకినవారేనని ఇటీవల ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వారికి ఎంత కాలానికి తిరిగి వ్యాధి సోకే అవకాశం ఉందనే దానిపై నిర్ధారిత సమయం అంటూ లేదు. తొలిసారి వచ్చిన వ్యాధి తీవ్రతను బట్టి, రోగిలో తయారయ్యే యాంటీబాడీస్ మీద అది ఆధారపడి ఉంటుంది. శరీరంలో సరిపడా యాంటీబాడీస్ ఉన్నంత వరకు రెండోసారి వ్యాధి సోకే అవకాశం ఉండదు. రెండోసారి వ్యాధి సోకినవారికి, ఇప్పుడే తొలిసారిగా పాజిటివ్ అయిన వారికి లక్షణాల్లో కచ్చితమైన తేడాలు కూడా ఏమీ చెప్పలేం. వారికి సోకిన కరోనా రకం (స్ట్రెయిన్) మీద, ఎంత కాలానికి సోకిందనే విషయం మీద, సదరు వ్యక్తుల రోగనిరోధక శక్తి మీద, వైరల్ లోడ్ ఎంత ఉందన్న దానిపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ► ఒక్క మశూచికి తప్ప ఇప్పటివరకు ఎన్నో వ్యాధుల కోసం తయారు చేసిన టీకాలేవీ కూడా వంద శాతం ప్రభావితం చూపలేదు. స్వల్పంగా అయినా ఇన్ఫెక్షన్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనదేశంలో ఇస్తున్న రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు కూడా దాదాపు 70% నుంచి 80% వరకు ప్రభావంతంగా పనిచేస్తున్నాయి. తొలిడోసు తీసుకున్న పదివేల మందిలో సగటున నలుగురికి, రెండు డోసులు తీసుకున్న పదివేల మందిలో ఇద్దరికి మాత్రమే తర్వాత వ్యాధి సోకినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇలాంటి వారిలో తీవ్ర లక్షణాలుగానీ, మరణాలుగానీ నమో దు కాలేదు. ఈ లెక్కన టీకా వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్టే. టీకా తీసుకున్న వారిలో వ్యాధి లక్షణాలు లేకున్నా.. వారి నుంచి ఇతరులకు వైరస్ సోకగలదని గుర్తుంచుకోవాలి. ► కరోనా సోకి తగ్గినవారిలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్న వారు కొంతవరకు సురక్షితమే అయినా.. ఆ యాంటీబాడీస్ ఎంత కాలం ఉంటాయనే దానిపై స్పష్టత లేదు, పైగా అవి పనిచేయని మరొక స్ట్రెయిన్ బారినపడే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కరోనా నియంత్రణలోకి వచ్చే దాకా జాగ్రత్త అవసరం. రెండుసార్లు సోకినా.. నా దగ్గరికి ఫస్ట్ వేవ్ సమయంలో 52 ఏళ్ల వయసు వ్యక్తి ఒకరు కోవిడ్‌తో వచ్చారు. షుగర్, హైపర్ టెన్షన్ వంటివి లేవు లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. హోంఐసోలేషన్‌లోనే ఉండాలని చెప్పి.. టెలి మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాను. 5 రోజుల్లోనే లక్షణాలు తగ్గిపోయాయి. అదే వ్యక్తి ఈ ఏడాది మార్చిలో మళ్లీ ఫీవర్, జలుబు, నీరసం, ఒళ్లునొప్పులతో వచ్చారు. టెస్ట్ చేయిస్తే మళ్లీ పాజిటివ్ వచ్చింది. మళ్లీ కరోనా వచ్చిందంటే తనకు ఇమ్యూనిటీ సరిగా లేదని బాధపడ్డారు. కౌన్సెలింగ్ చేసి జాగ్రత్తలు చెప్పాం. హోం ఐసోలేషన్‌లోనే ఉంచి మామూలుగానే మందులు, ట్రీట్ మెంట్ అందించాం. ఇప్పుడు వారం వరకు లక్షణాలు ఉన్నాయి. రికవరీ అయ్యాక సుమారుగా 3 వారాల పాటు నీరసంగా ఉన్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని వ్యాక్సినేషన్‌కు వెళ్లారు. వ్యాక్సిన్ వేసుకున్నాక.. ‘‘రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే కనిపించాయి. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి మందులతో రికవరీ అయ్యాను. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో మా ఇంట్లో వారికి వైరస్ సోకలేదు. మాతో కలిసి పనిచేస్తున్న వారిలో కొందరికి రెండోసారి కోవిడ్ వచ్చింది. ఒక డాక్టర్‌కు తొలిసారి కోవిడ్ వచ్చి తగ్గింది.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఫస్ట్ డోస్ తీసుకున్నారు. తర్వాత నెల రోజుల్లో మరోసారి కోవిడ్ వచ్చింది. బీపీ, షుగర్ ఉన్నా కోలుకుని విధులకు హాజరవుతున్నారు. ఇలా రెండుసార్లు కోవిడ్ వచ్చి తగ్గినవారు చాలా మందే ఉన్నారు. అయితే మెడికల్ పీజీ స్టూడెంట్స్‌లో ఒకరు రెండోసారి కరోనా సోకినప్పుడు సీరియస్ స్టేజ్‌కు వెళ్లారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రెండోసారి కోవిడ్ సోకి, సీరియసైన వారు ఎవరూ లేరు. వ్యాక్సిన్ వేసుకుంటే రికవరీ బాగుంటోంది! ‘ఏడాది నుంచీ కోవిడ్ రోగులతో పనిచేస్తున్నాను. రిస్క్ బాగా ఎక్కువగా ఉన్నా నేను కరోనా రాకుండా కాపాడుకోగలిగానంటే.. సాధారణ ప్రజలు కూడా కాపాడుకోగలరు అన్నట్టే కదా.. సరైన మాస్క్ ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ► చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటే చాలు ఇంకేం ప్రాబ్లెం ఉండదు అనుకుంటున్నారు. ఇది సరైంది కాదు. వ్యాక్సిన్ ద్వారా మనకు 100 శాతం రక్షణ రాదు. రెండో డోసు కూడా వేయించుకున్న 2 వారాలకుగానీ, లేదా తొలి డోస్ నుంచి కనీసం 45 రోజులకు గానీ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందదు. యాంటీబాడీస్ చెక్ చేయించుకుంటే అప్పుడే కనపడతాయి. తొలి డోసు తీసుకోగానే ఏమీ కాదులే అనుకుని తిరగొద్దు. రెండు డోసులు పూర్తయి యాంటీబాడీస్ వచ్చిన వారిలోనూ కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వ్యాక్సిన్ వేసుకోని వారితో పోలిస్తే వీరిలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా, రికవరీ వేగంగా ఉంది. ► ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చిపోయినందున ఏ సమస్య రాదని నిర్లక్ష్యంగా ఉండటం ప్రమాదకరం. గత నెల రోజుల్లో రెండోసారి వైరస్సోకిన 10 మంది వరకు మా డిపార్ట్మెంట్కు వచ్చారు. వారిలో యాంటీబాడీస్ తగ్గిపోవడం వల్ల మళ్లీ వైరస్సోకి ఉండొచ్చు. రీఇన్ఫెక్షన్ రేటు ప్రస్తుతం ఒక శాతంలోపే ఉంది. అది 2–3 శాతం వరకూ పెరిగినా ఫర్వాలేదు. అదే 20శాతం దాటితే మాత్రం ఇక రీఇన్ఫెక్షన్కు అంతు ఉండదనే చెప్పొచ్చు. అందువల్ల ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయినవారు కూడా మాస్క్, భౌతికదూరం, శానిటేషన్ సహా అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరిపడా నిద్ర వంటి అలవాట్లు చేసుకోవాలి. వెంటిలేటర్ వరకూ వెళ్లకుండా వ్యాక్సిన్ రక్ష రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాం.. ఇక మాకేం కాదనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాత్రం తిరగొద్దు. సెకండ్ వేవ్ వేరియంట్ చాలా భిన్నంగా ఉంది. కోవిడ్ గురించి పూర్తి పట్టు ఇంకా రాలేదు. వందల మందిని ట్రీట్ చేస్తూ కూడా.. ఏ పేషెంట్ ఎలా రికవర్ అవుతారు? ఎప్పుడు సీరియస్ అవుతారు? అనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మేం ఒకటి అనుకునేలోపే ఆరోగ్యం మరో విధంగా మారుతోంది. మా పేషెంట్స్‌లో కొందరు వ్యాక్సిన్ వేసుకున్నా తిరిగి పాజిటివ్ వచ్చింది. లక్షణాలు సీరియస్‌గా లేవు. వెంటిలేటర్ వరకు వెళ్లే అవసరం రావడం లేదు. అంటే 80శాతం వరకూ రిస్క్ ఉండదని చెప్పొచ్చు. ఈ వ్యాక్సిన్లు కేవలం 6, 7 నెలల ముందు తయారైనవి కాబట్టి వాటి సామర్థ్యం మీద అప్పుడే పూర్తిస్థాయి అంచనాలు వేయలేం. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కులు ఇతర జాగ్రత్తలు మాత్రం పొరపాటున కూడా మరచిపోవద్దు. -
అర్జునుని సందేహాలు శ్రీకృష్ణుని సమాధానాలు
మామిడిపూడి ‘గీత’ అర్జునుని సంశయాల ను విని శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో పరిహాసపూర్వకంగా పలుకుతున్నాడు.. ‘‘అర్జునా! నీవేమో తెలిసినవానిలా మాట్లాడావు. ప్రజ్ఞావాదమాడావు. ఎవరిని గురించి దుఃఖపడనక్కరలేదో వారిని గురించి దుఃఖిస్తున్నావు. నీ సంశయాలకూ, దుఃఖానికీ తగిన కారణం లేదు. దేహి యొక్క, దేహం యొక్క తత్వాన్ని నీవు తెలుసుకుంటే ఇలా దుఃఖించవు. ఆత్మ నిత్యమైనది. పుట్టిన ప్రతి ప్రాణీ మరణించవలసిందే. మరణించిన ప్రతి ప్రాణీ పుట్టవలసిందే. ఈ విధంగా పుడుతూ, చస్తూ ఉండే వారిని గురించి చింతించడమెందుకు? మొదటిమాట, ఈ దేహాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయో, నశించిన తర్వాత ఏమవుతున్నాయో నీకు తెలుసా? వీని మొదలుగాని, తుది గానీ కనిపించడం లేదు. మధ్యకాలంలో మాత్రమే ఇవి కనపడుతున్నాయి. ఆద్యంతాలు తెలియబడని వాటిని గురించి దుఃఖమెందుకు? (క్షాత్రధర్మం గురించి వచ్చేవారం) - కూర్పు: బాలు శ్రీని