విద్యార్థులు జవాబు పత్రాల్లో సరదగా చిత్ర విచిత్రమైన సమాధానాలు రాస్తూ కాలేజీ, లెక్చరర్ల దృష్టిలో పడుతూ ఉంటారు. ప్రశ్న పత్రంలో అడిగిన ప్రశ్నకు బదులు ఫన్నీ జవాబు రాసి వైరల్‌గా మారిన సంఘటనలు కూడా చాలానే చూశాం. అయితే తాజాగా ఇటువంటి సరదా ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజస్తాన్‌లోని దోల్‌పూర్ జిల్లాలో ఓ కాలేజీ పొలిటికల్ సైన్స్ పరీక్షలో భాగంగా ప్రశ్నపత్రంలో భారత్‌కు పాకిస్తాన్ మధ్య ఏ బార్డర్ (హిందిలో ‘సీమా’) ఉంటుంది? దాని పొడవు ఎంత? అని ఉంది. దీంతో ఓ విద్యార్థి తన చిలిపితనానికి పని చెప్పాడు. ‘సీమా’ పేరుతో తన క్లాస్‌లో ఓ ఆమ్మాయి ఉండటంతో.. భారత్-పాక్ మధ్య బోర్డర్‌గా‘సీమా హైదర్’ ఉంది. అంతే కాదు ఆమె ఎత్తు 5 అడుగలు 6 ఇంచులు కూడా ఉందని రాశాడు.
Question - Bharat aur Pakistan ke bich kaun si seema hai, lambai batao?
— Narundar (@NarundarM) December 21, 2023
Answer - Dono desho ke bich Seema Haider hai, uski lambai 5 ft 6 inch hai, dono desho ke bich isko lekar ladai hai. pic.twitter.com/25d5AvUlwl
అక్కడిదాగా బాగానే ఉన్న.. భారత్- పాక్ దేశాల మధ్య సీమా హైదర్ 5 అడుగుల 6 ఇంచుల ఎత్తులో ఉండటం వల్ల ఆమె కోసమే రెండు దేశాలు గొడవ పడుతున్నాయి అంటూ ఫన్నీగా ఆన్సర్ రాశారు. దీనికి సంబంధించి జవాబు పత్రాన్ని ఓ ఎక్స్(ట్వీటర్) యూజర్ పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అతను వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్’, ‘అతను రాసిన జవాబుకు ఒక మార్క్ ఎక్స్‌ట్రాగా వేయాలి’, పేపర్‌పై ఇన్విజిలేటర్ సంతకం లేదని.. అది నకిలీ పేపర్’ అని నెటజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment