సోషల్ మీడియా అంటేరు అనేక విషయాల సమూహం. సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు ఎన్నో అంశాలపై తమ తమ అభిప్రాయాలును ఈ వేదికగా పంచుకుంటున్నారు. నిత్యం వేలాది సరదా, ఆసక్తికర, విషయ పరిజ్ఞానాన్ని పెంచే కంటెంట్, వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బిహార్‌లో ఓ లోకల్ న్యూస్ రిపోర్టర్ అక్కడున్న కొంత మంది విద్యార్థులను పిలిచి పలు ప్రశ్నలు అడిగాడు. అయితే రిపోర్ట్ర్ అడిగిన ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోకుండానే ఓ పిల్లాడు తమకు తోచిన సమాధానాలు చెప్పాడు.
ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటని ప్రశ్నించగా.. పూర్తిగా వినకుండానే బైగాన్(వంగాయ) అని సమాధానమిచ్చాడు. తరువాత ఆ రిపోర్టర్ అబ్బాయిని సబ్జెక్ట్ గురించి అడుగుతున్నానని చెప్పడంతో ‘ఓహ్ సారీ, ఇట్స్ ఇంగ్లీషు’ అని బదులిచ్చాడు. ‘నీకు ఇంగ్లీష్‌లో ఏవైనా పద్యాలు గుర్తున్నాయా?’ అని అడిగితే.. బాలుడు కొంచెం కూడా తడబడకుండా ‘55 నుంచి 100 వరకు స్పెల్లింగ్ చెప్పగలను’ అంటూ సమాధానం చెప్పాడు.
చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు
అంతేగాక దేశ ప్రధాని ఎవరో చెప్పమని రిపోర్టర్ ప్రశ్నించగా.. మొదట నితీష్ కుమార్, ఆపై లాలూ యాదవ్ అని సమాధానం చెప్పాడు. దీంతో విసుగు చెందిన రిపోర్టర్ పీఎం అనే పదాన్ని నొక్కి చెప్పడంతో ‘మోదీ’ అని చెప్పాడు. పూర్తి పేరు అడిగినప్పుడు.. మోదీ సర్కార్! అంటూ గట్టిగా అరిచాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.. ఇప్పటి వరకు వీడియోకు 9 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.
అయితే పిల్లవాడు తెలిసీ తెలియక చెప్పిన సమాధానాలు నెటిజన్లచేత నవ్వూలు పూయించాయి. తనకు విషయ పరిజ్ఞానం లేదనే దాని కంటే అతడి అమాయకత్వపు జవాబులు విని పడిపడి నవ్వుతున్నారు.. కావాలంటే మీరూ ఈ వీడియోను చూడండి.
చదవండి: Viral Video: కిల్లింగ్ స్టెప్స్‌తో అదరగొట్టిన డాక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment