Actress Samantha Funny Reaction To Netizen Wanna Reproduce Question In Instagram - Sakshi
Sakshi News home page

Samantha: సమంతకు ఇన్‌స్టా యూజర్‌ తిక్క ప్రశ్న.. రీ ప్రొడ్యూస్‌ను గూగుల్​ చేసి చూడాలా ?

Published Tue, Feb 22 2022 10:54 AM | Last Updated on Wed, Feb 23 2022 6:28 PM

Samantha Ruth Prabhu Reacts On Wanna Reproduce Question - Sakshi

స్టార్​ హీరోయిన్​ సమంత వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన శాకుంతలం ఫస్ట్​ లుక్​ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలే కాకుండా సోషల్​ మీడియాలో కూడా హైపర్​ యాక్టివ్​గా ఉంటుంది సామ్​. తాజాగా తన ఇన్​స్టా అకౌంట్ పేజీలో 'ఆస్క్​ మీ ఎనీథింగ్'​ అనే సెషన్​ను నిర్వహించింది సమంత. ఈ సెషన్​ ఎంతో విచిత్రంగా సాగింది. ఇందులో నెటిజన్లు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలిచ్చింది. 



'మీ పనులు చేయడానికి ఇంత ధైర్యం ఎలా వస్తుంది' అని ఒక ఇన్​స్టా యూజర్​ అడిగిన ప్రశ్నకు 'అతిపెద్ద కష్టాలను ఎదుర్కొన్నప్పుడే గొప్ప ధైర్యం వస్తుంది' అని రిప్లై ఇచ్చింది సామ్​. అలాగే ఒక వ్యక్తి 'మీ ప్రతిరూపానికి పురుడు పోశారా? ఎందుకంటే మీ వంటివారిని మరొకరిని తయారు చేయాలనుకుంటున్నాను (ఐ వాన రీ ప్రొడ్యూస్‌ యూ)' అని క్వశ్చన్​ చేశాడు. ఆ ప్రశ్నకు సమంత అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది. ఇంతకూ ‘రీ ప్రొడ్యూస్‌’​ను ఒక వాక్యంలో ఎలా ఉపయోగిస్తారు? దానిని ముందుగా గూగుల్​ చేసి చూడాలా? అని కౌంటర్‌ వేసింది. మరో యూజర్ యంగ్​ జనరేషన్​ కోసం ఇచ్చే సలహా ఏంటీ అని అడగ్గా 'విరామం తీసుకోండి. డోంట్ బర్న్​ అవుట్​' అని బదులిచ్చింది.

(చదవండి: దేవకన్యలా సమంత.. శాకుంతలం ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది)



అలాగే ఒక నెటిజన్​ భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందా అని సామ్​ను ప్రశ్నించగా 'నేను చాలా ఆలస్యంగా నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడూ ఏది చెప్పకూడదు అని', 'అంతిమ లక్ష్యం ఏంటని అడిగిన' ప్రశ్నకు 'గుర్తుంచుకోవడం' అంటూ సమాధానాలు ఇచ్చింది. 'మీరు నెంబర్​ గేమ్​ #1 హీరోయిన్'​ అని నమ్ముతున్నారా అనే ప్రశ్నకు 'కాదు. నెంబర్​ వన్​ కంటే స్థిరంగా ఉండాలి' అని రిప్లై ఇచ్చింది సామ్​.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement