అర్జునుని సందేహాలు శ్రీకృష్ణుని సమాధానాలు
మామిడిపూడి ‘గీత’
అర్జునుని సంశయాల ను విని శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో పరిహాసపూర్వకంగా పలుకుతున్నాడు..
‘‘అర్జునా! నీవేమో తెలిసినవానిలా మాట్లాడావు. ప్రజ్ఞావాదమాడావు. ఎవరిని గురించి దుఃఖపడనక్కరలేదో వారిని గురించి దుఃఖిస్తున్నావు. నీ సంశయాలకూ, దుఃఖానికీ తగిన కారణం లేదు. దేహి యొక్క, దేహం యొక్క తత్వాన్ని నీవు తెలుసుకుంటే ఇలా దుఃఖించవు. ఆత్మ నిత్యమైనది. పుట్టిన ప్రతి ప్రాణీ మరణించవలసిందే. మరణించిన ప్రతి ప్రాణీ పుట్టవలసిందే. ఈ విధంగా పుడుతూ, చస్తూ ఉండే వారిని గురించి చింతించడమెందుకు? మొదటిమాట, ఈ దేహాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయో, నశించిన తర్వాత ఏమవుతున్నాయో నీకు తెలుసా? వీని మొదలుగాని, తుది గానీ కనిపించడం లేదు. మధ్యకాలంలో మాత్రమే ఇవి కనపడుతున్నాయి. ఆద్యంతాలు తెలియబడని వాటిని గురించి దుఃఖమెందుకు?
(క్షాత్రధర్మం గురించి వచ్చేవారం) - కూర్పు: బాలు శ్రీని