ఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో బీజేపీ నియంత పాలన సాగిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ విషం లాంటివి. ఆ విషాన్ని రుచి చూస్తే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదనే ఉద్దేశ్యంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
మీకు ప్రజాస్వామ్య పాలన కావాలా? నియంతృత్వ పాలన కావాలా.. మీరే తేల్చుకోవాలి. నియంతృత్వానికి మద్దతిచ్చే బీజేపీ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలి అని ఖర్గే అన్నారు. సభలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోరుకునే వారు చేతులెత్తండి.. అనగానే అంతా చేతులెత్తారు.
#WATCH | Delhi: Addressing the INDIA alliance rally at Ramlila Maidan, Congress President Mallikarjun Kharge says, "You have to decide if you want democracy or dictatorship... Those who support dictatorship need to be kicked out of the country... BJP and RSS are like poison. You… pic.twitter.com/wdisE7HQpU
— ANI (@ANI) March 31, 2024
Comments
Please login to add a commentAdd a comment