talasani Srinivas reddy
-
అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణం
-
దర్శనాలకు బ్రేక్.. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణపతికి చివరి పూజ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణపతి వద్దకు దర్శనం నిలిపివేశారు. ఇప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఇక, శోభాయాత్రకు ఖైరతాబాద్ గణపతి సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి 12 గంటలకు గణపతికి చివరి పూజ ఉంటుంది. రేపు(గురువారం) ఉదయమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా, తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52వేల విద్యుత్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు తాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 122 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటుతో అత్యవసర వైద్యసేవల కోసం 15 హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, అలాగే 33 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమొద్దని సూచించారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్ -
కోమటిరెడ్డి పూటకోమాట మాట్లాడతారు: తలసాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే కాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. అనంతరం, తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక, తాజాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు అర్థం లేనివి. కోమటిరెడ్డి పూటకోమాట మాట్లాడతారు. కోమటిరెడ్డి మాటల్లో విశ్వసనీయత లేదు. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. బీఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీపైనా ఆధారపడదు. వచ్చే ఎన్నికల్లో మాకు పూర్తి మెజార్టీ వస్తుంది. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ సాధిస్తాం. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌పై మంత్రి తలసాని స్పందించారు. కిషన్ రెడ్డి అంబర్పేట్, సికింద్రాబాద్‌కు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలన్నారు. అంబర్‌పేట్‌లో చేసిన అభివృద్ధిపై చర్చకు మా పార్టీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు. తాడు బొంగురం లేకుండా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలి. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
అట్టహాసం.. భారీ ర్యాలీలు
తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు ఆకట్టుకున్న కళాకారుల ఆటపాటలు సరూర్‌నగర్: మీర్‌పేటలోని టీకేఆర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బుధవారం మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ ఎంఎల్సీ గంగాధర్ తదితరులు చేరిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది . ముఖ్యమంత్రిని డీఎంఆర్ఎల్ చౌరస్తా నుంచి రంగారెడ్డి జిల్లా అమరవీరుల ప్రాంగణం వరకు (వేదిక) వందలాది వాహనాలతో ర్యాలీ జరిగింది. కేసీఆర్ వేదిక ఎక్కిన వెంటనే ‘జై తెలంగాణ నినాదాలతో’ సభా ప్రాంగణం మారు మోగింది. అంతకు ముందు సాయిచంద్ కళాకారుల బృందం తెలంగాణ ఆటపాటలతో ప్రజలను ఉత్తేజింపచేశారు. బడంగ్పేట్ నగరపంచాయతీ నుంచి పార్టీ నాయకులు కర్రె కృష్ణ, రాళ్లగూడె శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బైకుర్యాలీ నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా గులాబీమయం చేశారు. మైనారిటీ నేతలు తమతో తెచ్చుకున్న వాయిద్యాలతో ఆనందం వ్యక్తం చేశారు. మహేశ్వరానికి వరాల జల్లు మహేశ్వర నియోజకవర్గానికి ముఖ్యమంత్రికేసీఆర్ వరాలజల్లులు కురిపించారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గం అధివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆర్సీఐ రోడ్ నుంచి పహాడీ షరీఫ్ వరకు వెళుతున్న లింక్‌రోడ్‌ను నాలుగు లైన్ల రోడ్‌గా మార్చేందుకు సహకరించాలని, అలాగే భారీ విద్యుత్ ప్లాంట్‌ను మహేశ్వరంలోనే ఏర్పాటు చేయాలని తీగల కోరారు. ఇందుకు స్పందించిన కేసీఆర్ సభా వేదిక నుంచే పహాడీ షరీఫ్రోడ్కు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు వేయి కోట్లతో ఏర్పాటు చేయనున్న భారీ విద్యుత్ ప్లాంట్‌ను మహేశ్వరంలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు మహేశ్వరం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం మాదిరి అభివృద్ధి చేసి చూపిస్తానని, తనపై భరోసా పెట్టుకోవచ్చని చెప్పారు. -
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్!
హైదరాబాద్: రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ను గురువారం ఉదయం ప్రకాష్ గౌడ్ కలిశారు. వీరందరూ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. తలసాని శ్రీనివాస్, తీగల కృష్ణారెడ్డి... టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటన చేయగా ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి పార్టీ మారుతున్నట్టు స్పష్టం చేయలేదు. సాయంత్రం చంద్రబాబును ప్రకాష్ గౌడ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తానిప్పుడు పార్టీ మారడం లేదని చెప్పారు. తనను చేరమని టీఆర్ఎస్ ఆహ్వానించలేదన్నారు. టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు.