సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే కాకుండా.. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. అనంతరం, తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
ఇక, తాజాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు అర్థం లేనివి. కోమటిరెడ్డి పూటకోమాట మాట్లాడతారు. కోమటిరెడ్డి మాటల్లో విశ్వసనీయత లేదు. బీఆర్‌ఎస్‌కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. బీఆర్‌ఎస్ ఏ రాజకీయ పార్టీపైనా ఆధారపడదు. వచ్చే ఎన్నికల్లో మాకు పూర్తి మెజార్టీ వస్తుంది. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ సాధిస్తాం.
ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌పై మంత్రి తలసాని స్పందించారు. కిషన్ రెడ్డి అంబర్‌పేట్, సికింద్రాబాద్‌కు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలన్నారు. అంబర్‌పేట్‌లో చేసిన అభివృద్ధిపై చర్చకు మా పార్టీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు. తాడు బొంగురం లేకుండా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌లోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలి. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment