ప్రహరీ కూల్చివేత.. ఎమ్మెల్యేపై కేసు | case filed on mla prakash goud | Sakshi
Sakshi News home page

ప్రహరీ కూల్చివేత.. ఎమ్మెల్యేపై కేసు

Published Wed, Nov 1 2017 11:03 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ ప్రగతి కాలనీకి వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ తొలగించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ సర్వే నెంబర్‌ 161లో మోహన్‌రెడ్డి పేరుపై రెండెకరాలు, శ్రీనాథ్‌రెడ్డి పేరిట 1.36 గుంటల స్థలం ఉంది. ఈ దారి గుండా ప్రగతి కాలనీ, లాల్‌బహదూర్‌శాస్త్రీ కాలనీ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం స్థలం చుట్టూ మోహన్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డిలు ప్రహారీని నిర్మించి గేటును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం కాలనీ ప్రజలు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు తెలిపారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం స్థలం వద్దకు వచ్చి స్థానికులతో కలిసి ప్రహారీని కూల్చివేశాడు. దీంతో స్థల యజమానులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement