ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాదిమంది మహిళలు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె ప్రఖ్యాత ఉద్యమ నాయకురాలు, రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ మహిళ. కోల్‌కత్తాలోని జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 29 ఏళ్ల రిమ్‌జిమ్ సిన్హా ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ కావడమే కాదు అర్ధరాత్రి వేళలో ఉద్యమ స్వరమై ప్రతిధ్వనించింది...
కోల్‌కత్తా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌తో పాటు ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది మహిళలు ఆగస్ట్ 14 అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చారు. ‘రీక్లెయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్’ కాప్షన్‌తో రిమ్‌జిమ్ సిన్హా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపించేలా చేసింది.
‘మహిళల కొత్త స్వాతంత్య్ర పోరాటం’గా ‘రీక్లెయిమ్ ది నైట్’ క్యాంపెయిన్‌ను అభివర్ణించింది రిమ్‌జిమ్ సిన్హా. రీక్లెయిమ్ ది నైట్’ చిహ్నమైన నెలవంక పట్టుకున్న ఎర్ర చేతి పోస్టర్ వైరల్ అయింది.
రిమ్‌జిమ్ సిన్హా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోషల్‌సైన్స్ రిసెర్చర్. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నన్ను బాధ పెట్టడమే కాదు అభధ్రతాభావానికి గురి చేసింది. నగరాల్లో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు? అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కోరుతూ ఆగస్ట్ 14 అర్ధరాత్రి నిరసన ప్రదర్శన చేయాలనుకున్నాను. రాత్రిపూట బయటకు వెళ్లే హక్కు మహిళలకు ఎందుకులేదు?’ అంటున్న రిమిజిమ్ సిన్హా సోషల్ మీడియా
వేదికగా ఎంతో మంది మహిళలను ఐక్యం చేసింది.
మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై రిమ్‌జిమ్ సిన్హా మండిపడింది. ‘జూనియర్ డాక్టర్ ఒంటరిగా సెమినార్ హాల్‌కు ఎందుకు వెళ్లింది?’ అని ఆయన ప్రశ్నించాడు.
‘బాధితురాలిపై నిందలు మోపే కుసంస్కారాన్ని అంగీకరించబోము. రాత్రివేళ బయట ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు’ అంటుంది సిన్హా. తన పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దేశవ్యాప్తంగా వేలాది మంది అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వస్తారని ఆమె ఊహించలేదు.
‘వందమంది వరకు వస్తారనుకున్నాను. ఒకవేళ ఎవరూ రాకుంటే నేను ఒక్కదానినే బయటికి రావాలనుకున్నాను. ఇంతమంది మహిళలు అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి వస్తారని నేను ఊహించలేదు. వారి స్పందన నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది సిన్హా. రిమ్‌జిమ్ సిన్హా పేరు సంచలనం కావడం మాట ఎలా ఉన్నా ఎంతోమంది రాజకీయ నాయకులకు టార్గెట్‌గా మారింది. ‘రీక్లయిమ్ ది నైట్’ ఉద్యమ చిహ్నానికి రకరకాలుగా భాష్యం చెబుతూ విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు.
‘అర్ధరాత్రిపూట బయటకు వస్తున్నారు. మీకేమైనా అయితే పూచీ మాది కాదు’ అంటున్న రాజకీయ నాయకులు ఉన్నారు. జాదవ్‌పూర్‌లోని 8బీ బస్‌స్టాండ్‌కు దగ్గర జరిగిన సభకు హాజరమైన రిమ్‌జిమ్ సిన్హా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన గురించి మాత్రమే కాదు రాత్రివేళలో మహిళలకు ఎదురయ్యే ట్సాన్స్‌పోర్ట్ సమస్యలు, పని ప్రదేశంలో మహిళలకు సెపరేట్ టాయిలెట్‌లు, బడులలో లింగ సమానత్వంపై ΄ాఠ్యాంశాలు, రాత్రి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులకు సురక్షితమై విశ్రాంతి గదులు... మొదలైన వాటి గురించి మాట్లాడింది. ‘రీక్లయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్స్’ను దృష్టిలో పెట్టుకొని ‘ఇది మహిళల కొత్త స్వాతంత్య్ర ΄ోరాటం’ అంటున్న రిమ్‌జిమ్ సిన్హా ఆ ΄ోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment