నెల్లూరు (క్రైమ్) : ఓ మొబైల్ దుకాణంలో సెల్‌ఫోన్ దొంగతనానికి పాల్పడిన దొంగను బుధవారం మూడోనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ట్రంకురోడ్డులోని లాట్ మొబైల్ షాపులో ఈ నెల 15వ తేదీన గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు.
-
మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
నెల్లూరు (క్రైమ్) : ఓ మొబైల్ దుకాణంలో సెల్‌ఫోన్ దొంగతనానికి పాల్పడిన దొంగను బుధవారం మూడోనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ట్రంకురోడ్డులోని లాట్ మొబైల్ షాపులో ఈ నెల 15వ తేదీన గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. సెల్‌ఫోన్లు కొంటున్నట్లు నటిస్తూ రూ.38,239 వేలు విలువ చేసే శ్యామ్‌సంగ్ జె7, ఓపో మోడల్, మైక్రోమాక్స్ టాప్ సెల్‌ఫోన్లను అపహరించుకుని వెళ్లాడు. ఈ ఘటనపై షాపు మేనేజర్ ఈ నెల 25వ తేదీన మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ పి. రామకృష్ణ పరిశీలించారు. షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుడి ఛాయాచిత్రం లభ్యమైంది. దాని ఆధారంగా సెల్‌ఫోన్‌లను దొంగలించిన వ్యక్తి గూడూరు పట్టణం శాంతినగర్‌కు చెందిన పాలేటి నవీన్‌చంద్ర అలియాస్ నవీన్‌గా గుర్తించారు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు బుధవారం నిందితుడు బృందావనంలోని తిక్కన టెలిఫోన్ భవన్ వద్ద ఉండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.