Lot Mobile Store
-
లాట్ మొబైల్ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా ఆఫర్లను ఇస్తున్నట్లు లాట్ మొబైల్స్ తెలిపింది. అమెజాన్ పే, బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.3500 క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. పేటీఎం మాల్ పేమెంట్ ద్వారా 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్, ఓచర్ల రూపంలో మరో ఐదుశాతం వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి పదిశాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది. శాంసంగ్ మొబైల్స్, ల్యాప్‌ట్యాబ్‌ల కొనుగోలుపై రూ.15000 వరకు, వన్‌ప్లస్ మొబైల్స్ పైన రూ.10000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్మార్ట్ టీవీలపై రూ.3500ల తక్షణ క్యాష్‌బ్యాక్‌ను, హెచ్‌పీ ల్యాప్ట్యాబ్లపై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే బ్రాండెడ్ ఉపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది. పండుగ సందర్భంగా లాట్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లు కస్టమర్లంతా వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ కోరారు. -
సెల్ఫోన్ల దొంగ అరెస్ట్
మూడు సెల్ఫోన్లు స్వాధీనం నెల్లూరు (క్రైమ్) : ఓ మొబైల్ దుకాణంలో సెల్‌ఫోన్ దొంగతనానికి పాల్పడిన దొంగను బుధవారం మూడోనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ట్రంకురోడ్డులోని లాట్ మొబైల్ షాపులో ఈ నెల 15వ తేదీన గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. సెల్ఫోన్లు కొంటున్నట్లు నటిస్తూ రూ.38,239 వేలు విలువ చేసే శ్యామ్‌సంగ్ జె7, ఓపో మోడల్, మైక్రోమాక్స్ టాప్ సెల్ఫోన్లను అపహరించుకుని వెళ్లాడు. ఈ ఘటనపై షాపు మేనేజర్ ఈ నెల 25వ తేదీన మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ పి. రామకృష్ణ పరిశీలించారు. షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుడి ఛాయాచిత్రం లభ్యమైంది. దాని ఆధారంగా సెల్ఫోన్లను దొంగలించిన వ్యక్తి గూడూరు పట్టణం శాంతినగర్‌కు చెందిన పాలేటి నవీన్‌చంద్ర అలియాస్ నవీన్‌గా గుర్తించారు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు బుధవారం నిందితుడు బృందావనంలోని తిక్కన టెలిఫోన్ భవన్ వద్ద ఉండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
కొత్త అప్లికేషన్ల ‘లాట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీకో మొబైల్ కావాలి. షాపుకెళ్లారు. వెళ్లి అక్కడి ప్రతినిధికి మీ వివరాలు చెప్పారు. మీరెలాంటి మొబైల్ కావాలనుకుంటున్నారో, దాన్లో ఏఏ ఫీచర్లు ఉండాలనుకుంటున్నారో... ధర ఎంతలో కావాలనుకుంటున్నారో ఆ ప్రతినిధికి చెప్పారు. టాబ్లెట్ పీసీలో ఆ వివరాలన్నీ నమోదు చేసిన ఆ ప్రతినిధి... సమాచారాన్ని వేరొక ప్రతినిధికి పంపాడు. కస్టమర్ దగ్గరకొచ్చిన ఆ ప్రతినిధి చేతిలోని ట్యాబ్లెట్లో... సదరు కస్టమర్ కోరిన ఫీచర్లతో, ఆ ధరలో ఏఏ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో అప్పటికే సిద్ధంగా ఉంది. ఈ కొత్త సాఫ్ట్వేర్ పేరే... స్మార్ట్ మ్యాచ్ మేకర్. సంక్షిప్తంగా ఎస్ఎంఎం. దీంతో పాటు ప్రతి మొబైల్‌కు, ట్యాబ్లెట్‌కు పక్కనే ఒక ఫీచర్ కార్డ్ జతచేసి ఉంటుంది. మొబైల్ షాప్ ప్రతినిధి తన చేతిలోని ట్యాబ్లెట్‌ను ఆన్ చేసి ఆ కార్డుపై పెట్టగానే... ఆ కార్డుకు జతచేసిన మోడల్ తాలూకు ఫీచర్లన్నీ వీడియో ద్వారా ప్రత్యక్షమవుతాయి. ఇది... వర్చువల్ రియాలిటీ. ఇండియాలో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ పద్ధతుల్ని తమ షాపుల్లో వినియోగిస్తున్నట్లు మొబైల్ దుకాణాల చైన్ ‘లాట్’ తెలియజేసింది. తమ షాపును సందర్శించిన ప్రతి కస్టమర్ ఈ విధానాల వల్ల వినూత్న అనుభూతికి లోనవుతారని, వారికి అభిరుచికి తగ్గ మోడల్ ఖచ్చితంగా దొరుకుతుందని శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ లాట్ ప్రతినిధి తెలియజేశారు. తమ టీమ్ ఆరునెలల పాటు శ్రమించి ఈ అప్లికేషన్లను తయారు చేసిందన్నారు.