కొత్త అప్లికేషన్ల ‘లాట్’ | Allu Arjun Inaugurates Lot Mobile Store | Sakshi
Sakshi News home page

కొత్త అప్లికేషన్ల ‘లాట్’

Published Sat, Sep 7 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

కొత్త అప్లికేషన్ల ‘లాట్’

కొత్త అప్లికేషన్ల ‘లాట్’

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీకో మొబైల్ కావాలి. షాపుకెళ్లారు. వెళ్లి అక్కడి ప్రతినిధికి మీ వివరాలు చెప్పారు. మీరెలాంటి మొబైల్ కావాలనుకుంటున్నారో, దాన్లో ఏఏ ఫీచర్లు ఉండాలనుకుంటున్నారో... ధర ఎంతలో కావాలనుకుంటున్నారో ఆ ప్రతినిధికి చెప్పారు. టాబ్లెట్ పీసీలో ఆ వివరాలన్నీ నమోదు చేసిన ఆ ప్రతినిధి... సమాచారాన్ని వేరొక ప్రతినిధికి పంపాడు. కస్టమర్ దగ్గరకొచ్చిన ఆ ప్రతినిధి చేతిలోని ట్యాబ్లెట్లో... సదరు కస్టమర్ కోరిన ఫీచర్లతో, ఆ ధరలో ఏఏ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో అప్పటికే సిద్ధంగా ఉంది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ పేరే... స్మార్ట్ మ్యాచ్ మేకర్. సంక్షిప్తంగా ఎస్‌ఎంఎం. దీంతో పాటు ప్రతి మొబైల్‌కు, ట్యాబ్లెట్‌కు పక్కనే ఒక ఫీచర్ కార్డ్ జతచేసి ఉంటుంది.
 
 మొబైల్ షాప్ ప్రతినిధి తన చేతిలోని ట్యాబ్లెట్‌ను ఆన్ చేసి ఆ కార్డుపై పెట్టగానే... ఆ కార్డుకు జతచేసిన మోడల్ తాలూకు ఫీచర్లన్నీ వీడియో ద్వారా ప్రత్యక్షమవుతాయి. ఇది... వర్చువల్ రియాలిటీ. ఇండియాలో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ పద్ధతుల్ని తమ షాపుల్లో వినియోగిస్తున్నట్లు మొబైల్ దుకాణాల చైన్ ‘లాట్’ తెలియజేసింది. తమ షాపును సందర్శించిన ప్రతి కస్టమర్ ఈ విధానాల వల్ల వినూత్న అనుభూతికి లోనవుతారని, వారికి అభిరుచికి తగ్గ మోడల్ ఖచ్చితంగా దొరుకుతుందని  శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ లాట్ ప్రతినిధి తెలియజేశారు. తమ టీమ్ ఆరునెలల పాటు శ్రమించి ఈ అప్లికేషన్లను తయారు చేసిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement