New applications
-
రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నుంచి అమలు చేయాలని భావిస్తున్న ‘రైతు భరోసా’కోసం రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ మరోసారి సమావేశమై వివిధ అంశాలను చర్చించింది.మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సమావేశమై రైతు భరోసా విధివిధానాలకు తుదిరూపు ఇచ్చారు. ఈ నెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో ‘రైతు భరోసా’కు, కేబినెట్ కమిటీ సిఫారసులకు ఆమోదముద్ర వేయనున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్‌పై భిన్నాభిప్రాయాలు ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఒక మండలాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ మూడురోజుల్లోనే గ్రామ సభలు నిర్వహించి, రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహా్వనించాలనే అభిప్రాయానికి వచ్చారు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలన్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ దరఖాస్తుల అంశాన్ని తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఇప్పటివరకు మంత్రులు చెప్పిన అభిప్రాయాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన, ముఖ్యమంత్రి సూచనలతో పూర్తిస్థాయి నివేదికను రూపొందించి శనివారం మంత్రివర్గ సమావేశం ముందుంచనున్నారు. సాగుచేసే రైతులందరికీ భరోసారాష్ట్రంలో భూమి సాగు చేసే రైతులందరికీ తప్పనిసరిగా సాయం అందించాలనే నిర్ణయానికి సబ్ కమిటీ వచ్చినట్లు తెలిసింది. శాటిలైట్ మ్యాపింగ్, అధికారుల సర్వేకు అనుగుణంగా రైతు సాగు చేసే భూమిని ప్రతి సీజన్లో లెక్క కట్టే అంశాన్ని నిబంధనల్లో చేర్చాలని స్పష్టంగా పేర్కొనట్లు సమాచారం. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో కోటీ 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, సాగుభూమి కోటీ 30 లక్షల ఎకరాలుగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది.ఇందులో యాసంగిలో 70 లక్షల ఎకరాల వరకే వివిధ పంటలు సాగవుతాయి. ఈ పరిస్థితుల్లో సీలింగ్‌తో సంబంధం లేకుండా సాగుభూమి మొత్తానికి రైతు భరోసా అమలు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. అలాగే భూగరిష్ట పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే సమస్యలపై కూడా మరోసారి చర్చించినట్లు తెలిసింది. ఐటీ చెల్లింపుదారులను రైతు భరోసాకు అనర్హుల్ని చేసే ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’మార్గదర్శకాలను అమలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. -
6 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
-
ఏపీ: ఐదు రోజుల్లోనే కొత్త రేషన్‌కార్డు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా రేషన్ కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. (4 నెలల ముందుగానే వైఎస్సార్ వాహన మిత్ర) రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి 10,15 కిలోల చొప్పున సంచులను అందిస్తామన్నారు.ఒక్కో సంచీ తయారీకి రూ.25 ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు కోన శశిధర్ తెలిపారు. (బీసీలకు ‘పథకాల’ పంట) -
ఇక అబద్ధాలు చెప్పలేరు
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్) : హాలో.... ఎక్కడున్నావ్... నేను అడవిలో ఉన్న సార్... అని ఇంట్లో ఉండి అబద్దం చెబుతాడు ఓ అధికారి. గత వేసవిలో ఓ హోటల్లో భోజనం చేస్తున్న ఓ బీట్ అధికారికి ఎఫ్‌డీవో ఫోన్ చేసి మీ ఏరియాలోని అడవిలో అగ్ని ప్రమాదం జరిగిందంట, అక్కడికి వెళ్లి చూసుకో అని సమాచారం ఇస్తాడు. లేదు సార్ నేను అడవిలోనే ఉన్నాను. మీకు వచ్చిన సమాచారం అబద్ధమని తప్పించుకున్నాడు. ఇకనుంచి అబద్ధం చెప్పడానికి వీలులేకుండా చేస్తోంది కొత్త సాఫ్ట్వేర్. ఇంట్లో కూర్చోని పనిచేశాను. అడవిలో తిరుగాను, అంత బాగానే ఉందని చెప్పి తప్పించుకునే అవకాశం లేదు. ఆ అబద్ధాలు చెప్పి తప్పించుకునే వారికి స్వస్తి పలుకుతుంది నూతనంగా రూపొందించిన ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్. సత్ఫలితాలిస్తున్న సాఫ్ట్వేర్ వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వారు రూపొందించిన ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్ సత్ఫలితాలిస్తోంది. గతంలో కొందరు కిందిస్థాయి అటవీశాఖ సిబ్బంది విధుల్లో లేకున్న తమ స్వంతపనులపై వెళ్లినా విధుల్లోనే ఉన్నామని అబద్ధాలు చెప్పుకుని విధులకు ఎగనామం పెట్టే వారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఈ ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్ అధికారుల పని తీరును గమనించడమే కాకుండా వన్యప్రాణులు, అడవుల నరికివేత, పశువులు వివరాలు, నీటి వనరులు, వన్యప్రాణుల ఆనవాళ్లు తదితర అంశాలను సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తే అధికారులు తెలుసుకునే వీలుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను రెండు సంవత్సరాల క్రితం వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు దేశంలోని టైగర్‌జోన్ ప్రాంతాలలో ఈ సాఫ్ట్వేర్ ఇచ్చారు. కవ్వాల్ టైగర్జోన్లోనూ ఇచ్చిన ఆ సాఫ్ట్వేర్ వినియోగంలోకి రాలేదు. ఇటీవల అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం అండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వడంతో సాఫ్ట్వేర్ ఆ ఫోన్లో వేసి అధికారుల పనితీరు పరిశీలించిన అంతగా ఫలితాలు కనిపించలేదు. నెలకు 26 రోజులు తప్పనిసరి కవ్వాల్ టైగర్‌జోన్‌లో పని చేసే బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు ఎంస్ట్రైబ్ సాఫ్ట్‌వేర్‌లో నెలకు 26 రోజులు పర్యటన వివరాలు పొందురుచాలి. ఒక్క రోజు పొందుపరుచకపోయిన వారు ఆ రోజు విధులకు ఎగనామం పెట్టినట్లే అర్థం. అంతే కాకుండా రోజు ఒకే వైపు వెళ్లిన, బైక్‌పై వెళ్లిన కూడా గుర్తించవచ్చు. వెంటనే వారికి మెమో ఇచ్చి జీతంలో కోత విధిస్తారు. ఒక్కో అధికారి రోజుకు 4 కిలో మీటర్ల దూరంలో పర్యటన చేసిన 55మంది రోజుకు 220 కి.మీ దూరం పర్యటన జరుగుతుందని. దీంతో టైగర్‌జోన్‌లో ప్రొటెక్షన్ జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీట్ అధికారి, సెక్షన్ అధికారి తమ విధులు సక్రమంగా నిర్వహించడమే కాకుండా, వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు ఉంటుంది. ఉద్యోగులు సాఫ్ట్‌వేర్‌ను వాడేలా చేస్తున్నాం వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రడూన్ వారు రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌తో అనేక ఫలితాలున్నాయి. సిబ్బందిపై మానిటరింగ్ కాకుండా పలు విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సిబ్బంది తమ రేంజ్ కార్యాలయాల్లో రోజువారి డాటా డౌన్లోడ్ చేసి కంప్యూటర్లో పొందుపరుస్తారు. రేంజ్ అధికారులు డివిజన్‌కు ఇస్తారు. వాటిని డివిజన్ వారిగా సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తాం. దీంతో ఇక్కడి విషయాలు టైగర్ కన్జర్వేషన్ సోసైటీ దృష్టికి వెళ్తోంది. ఈ విషయంలో సిబ్బందికి సాఫ్ట్‌వేర్‌కు అలవాటు పడి ప్రతి రోజు విధులు నిర్వహణ చేసేలా అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు సిబ్బంది ప్రతి అంశాన్ని సాఫ్ట్వేర్లోనె పొందుపరుస్తున్నారు. – మాధవరావు, ఎఫ్‌డీవో -
‘ఈ-పెట్టి యాప్‌తో నేరాలకు చెక్’
సాక్షి, హైదరాబాద్: ఈ -పెట్టి యాప్ ద్వారా చిన్న నేరాలకు చెక్ పెట్టవచ్చని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఈ-పెట్టి యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న నేరాలను అదుపులోకి తెచ్చినపుడే పెద్ద నేరాలు తగ్గుతాయని అందుకోసం ఈ యాప్ ఎంతగానో ఉపయోపడుతుందన్నారు. హైదరాబాద్ నగర పోలీసులు పైలెట్ వర్షన్‌గా అమలు చేసిన ఈ యాప్ సత్ఫలితాలిచ్చిందని తెలిపారు. రాష్డ్ర వ్యాప్తంగా ఈ యాప్ అమలులోకి వస్తుందని, పోలీసులు ట్యాబ్ ద్వారా అక్కడికక్కడే కేసు నమోదు చేయవచ్చన్నారు. డిజిటల్‌గా ఉండే ఆధారాలను ఇందులో పొందుపరచవచ్చని, ఒక వ్యక్తి క్రైం ట్రాక్ రికార్డ్ మొత్తం ఈ యాప్‌లో ఉంటుందన్నారు. ఇష్టమొచ్చినట్టుగా కేసులు పెట్టే ఆస్కారం లేకుండా సరైన సాక్ష్యాలు ఉంటేనే కేసు నమోదు చేసేలా ఈ టెక్నాలజీ రూపొందించారని ఆయన తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు ఈ-యాప్‌తో మరో ముందడుగువేశారు. దీంతో మేజర్, సీరియస్, పెట్టి కేసులను వెంటనే గుర్తించి... నేరాలను అదుపు చేసే అవకాశం ఉంటుంది. -
‘సహకార’ ఓటరు జాబితాకు రెడీ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఓటరు జాబితాలు తయారుచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని ఈసారి ఓటుహక్కు ఉన్న రైతు ఫొటోలతో కూడిన జాబితాలు తయారుచేయాలని నిర్ణయించారు. జాబితా తయారీకి ఫిబ్రవరి 15వ తేదీని గడువు విధించారు. కథలాపూర్(వేములవాడ) : జిల్లాలోని 18 మండలాల్లో 51 సహకార సంఘాలున్నాయి. ఇందులో 95,386 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఓటరు జాబితా తయారీ సహకార సంఘాలవారీగా చేపట్టాల్సి ఉండడంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఓటరుజాబితాల ఫైళ్లను వెతికి సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. వీటికితోడు కొత్తగా ఓటు హక్కు కావాలనుకునే రైతులకు అవకాశం కల్పిస్తున్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. ముగుస్తున్న గడువు... సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 31తో ముగియనుంది. పాలకవర్గాల పదవీకాలం పొడిగిస్తారా.. లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా, ఎన్నికలు నిర్వహిస్తారా? అనే విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సిఉంది. గడువు ముగియనుండడంతో సహకార ఎన్నికల బరిలో ఉండాలనుకునే వారు ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు. ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తయారుచేయాలని ఆదేశాలు రావడం.. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో గ్రామాల్లో సహకార సంఘాల ఎన్నికల వేడి రాజుకుంటోంది. సహకార సంఘాల అధ్యక్ష, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న నాయకులు తమ అనుచురుల పేర్లు ఓటరు జాబితాలో చేర్పించే ప్రయత్నంలో మునిగిపోయారు. గ్రామాల్లో ముఖ్యనేతలు కూడళ్ల వద్ద తమ అనుచరగణంతో మంతనాల్లో మునిగి తేలుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే... సహకార సంఘాల్లో ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు పట్టదారు పాసుబుక్కు, ఆధార్‌కార్డ్ జిరాక్స్‌తోపాటు రూ.350 చెల్లించి రెండు ఫొటోలు తమ పరిధిలోని కార్యాలయాల్లో అందించాలి. గతంలో ఓటరు జాబితాలో పేర్లున్న రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్‌తోపాటు రెండు ఫొటోలు ఇవ్వాలి. ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు సమర్పించాలి సహకార సంఘాల ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని, తప్పులు లేకుండా తయారు చేయాలని అధికారులకు సూచించాం. ఓటరు జాబితాను రైతు ఫొటోలతో అనుసంధానం చేసేందుకు ఫిబ్రవరి 15 వరకు చివరి గడువు విధించాం. ఓటరు జాబితాలో పేర్లున్న రైతులు ఫొటోలను సహకార సంఘం కార్యాలయాల్లో గడువులోగా అందించాలి. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకునే రైతులు పరిధిలోని సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించాలి. –రామానుజచార్యులు, జిల్లా సహకార అధికారి -
ఏపీవై చందాదారులకు కొత్త ‘ఆధార్’ పత్రం
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారుల నుంచి ఆధార్ వివరాలు సేకరించేందుకు వీలుగా సోమవారం నుంచి కొత్త దరఖాస్తు పత్రాలను వినియోగించాలని పీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) బ్యాంకులు, పోస్టాఫీసులను కోరింది. దీనిపై గతంలో అనేకసార్లు ఆర్థిక సేవల విభాగం, బ్యాంకులు, పోస్టాఫీసుల అధికారులతో చర్చలు జరిపామనీ, జనవరి 1 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించామని పీఎఫ్ఆర్డీఏ వెల్లడించింది. -
‘సర్వర్ డౌన్’ తిప్పలు!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డుల కోసం కొత్త దరఖాస్తుల నమోదు బాధ్యత మీ సేవ కేంద్రాలకు అప్పగించడంతో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక నేరుగా సర్కిల్ కార్యాలయాల్లో కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ పూర్తిగా నిలిపివేసింది. మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్ సర్వర్ మొరాయిస్తుండటంతో పాటు పూర్తి స్థాయి డేటా అప్డేట్ లేక దరఖాస్తుల అప్లోడ్ పెండింగ్‌లో పడిపోతున్నాయని పేదలు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసిన తెల్లరేషన్ కార్డులను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా దరఖాస్తులు స్వీకరించి ఆహార భద్రత కార్డులను మంజూరు చేసింది. గతేడాది కాలంగా పౌరసరఫరాల శాఖ అధికారులు కార్డులు లేని పేద కుటుంబాల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తూ అధార్ కార్డులను పరిగణలోకి తీసుకొని అర్హులకు ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తూ వస్తున్నారు. పౌరసరఫరాల శాఖ సర్కిల్ కార్యాలయాల్లో నేరుగా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు, మంజూరైన కార్డుల్లో చేర్పులు, మార్పులు, సవరణలకు వెసులుబాటు ఉండటంతో ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. తాజాగా ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచి కొత్త దరఖాస్తులు, కార్డుల్లో చేర్పులు, మార్పులు, సవరణల కోసం ఆన్లైన్ ద్వారా నమోదు చేసే బాధ్యత మీ సేవ కు అప్పగించింది. కనిపించని డేటా.... మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ సర్వర్ మొరాయించడం కొత్త దరఖాస్తుల నమోదుకు ప్రధాన సమస్యగా తయారైంది. మరోవైపు ఆన్లైన్లో ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అప్డేట్ లేకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. మీసేవ ద్వారా ఆన్లైన్లో కొత్త దరఖాస్తులు నమోదు కోసం కొన్ని అప్షన్స్‌కు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అప్డేట్ లేకుండా పోయింది. దరఖాస్తుదారుడి చిరునామాను బట్టి ఆ ప్రాంతానికి ఏ షాపు నంబర్ వర్తిస్తుందో స్పష్టంగా పొందుపర్చలేదు. లబ్ధిదారుడే తెలుసుకొని వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు సబంధించిన గ్యాస్ ఏజెన్సీ పేర్లు ఆప్షన్లో కనిపించక పోవడంతో అప్లోడ్ సమస్య తలెత్తుతోంది. బాదుడు... మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొత్త రేషన్ కార్డుల నమోదు కోసం పేదలను బాదేస్తున్నారు. వాస్తవంగా నిబంధనల ప్రకారం కొత్త కార్డుల కోసం దరఖాస్తును నమోదు చేసేందుకు కేవలం రూ.35 లు ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ దరఖాస్తుదారుల అమాయకత్వాన్ని బట్టి కనీసం రూ.75 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఆహార భద్రత కార్డుల మంజూరు కోసం మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, అడ్రస్‌ప్రూఫ్, సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన కుటుంబాలకు కార్డులను మంజూరు చేస్తాం. కార్డుల కోసం మధ్య దళారులను ఆశ్ర యించవద్దు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని సర్కిల్ కార్యాలయంలో సమర్పిస్తే సరిపోతుంది. అర్హులకు తప్పకుండా కార్డులు మంజూరు చేస్తాం. - రాథోడ్, డీఎస్ఓ, హైదరాబాద్ -
భలే ఆప్స్
విండోస్ 8.1పై కొత్త అప్లికేషన్లు! విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగిస్తున్న వారికి ఈ దీపావళి సందర్భంగా కొత్త అప్లికేషన్లను తీసుకొస్తున్నామని ప్రకటించింది మైక్రోసాఫ్ట్. పీసీ వినియోగంలో ఈ అప్లికేషన్లు సరికొత్త అనుభవాన్ని ఇస్తాయిని మైక్రోసాఫ్ట్వాళ్లు అంటున్నారు. ఇ-వెంట్: ఇది ఒక క్విక్ ఈవెంట్ మేనేజ్ అప్లికేషన్. సంబరాల సమయంలో సోషల్ మీడియా ద్వారా అందరికీ కనెక్ట్ కావడానికి ఈ అప్లికేషన్ ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. నాన్‌స్టాప్ మ్యూజిక్: సొంతంగా మ్యూజిక్ మిక్స్ చేసి.. ఇష్టమైనట్టుగా కొత్త ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. వీటితో పాటు వందల, వేల కొద్దీ రెసిపీల గుట్టును వివరించి కొత్త రుచులు చూపించే ఎమ్ఎస్ఎన్ ఫుడ్ అండ్డ్రింక్, లూమియా సెల్ఫీ, ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఫోటో ఫూనియా, ఇన్‌స్టాగ్రామ్‌లను విండోస్ 8.1పై అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మాత్రమే గాక దీపావళి సంబరాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఐదివాళీ, రంగోళీ క్రియేటర్ వంటి అప్లికేషన్లను కూడా విండోస్8.1 వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ల్యాప్స్ ఇట్తో అద్భుతమైన వీడియోలు టైమ్‌ల్యాప్స్ వీడియోగ్రఫీ గురించి మీరు వినే ఉంటారు. మెరుపువేగంతో మారిపోయే ఫ్రేమ్స్‌తో సృష్టించే ఈ రకమైన వీడియోలను అప్పుడప్పుడు సినిమాల్లోనూ చూసే ఉంటాం. ఇలాంటి అద్భుతాలను మీ స్మార్ట్‌ఫోన్‌తోనూ సృష్టించుకోవచ్చు. కావాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ‘ల్యాప్స్ ఇట్’ అప్లికేషన్ మాత్రమే. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలోని సెన్సర్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని అద్భుతమైన ఫొటోలు తీయడంతోపాటు వాటితో అందమైన టైమ్‌ల్యాప్స్ వీడియోలను కూడా సృష్టించుకోవచ్చు. ఫిల్టర్ల సాయంతో స్పెషల్ ఎఫెక్ట్లు కూడా సృష్టించుకోవచ్చు. వీడియోలను మెరుపువేగానికి మార్చుకోవడంతోపాటు చాలా స్లోగానూ రన్ చేయవచ్చు. ప్రోగ్రామింగ్ కోసం ట్రీహౌస్... మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఉందా? అయితే ట్రీహౌస్ అప్లికేషన్ మీ కోసమే. ఆన్లైన్ పద్ధతిలో ప్రోగ్రామింగ్ మెళకువలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌తో రూబీ ఆన్ రెయిల్స్, పీహెచ్‌పీ, పైథాన్ వంటి వాటిని ఉపయోగించే నైపుణ్యం కలిగించేందుకు ఈ అప్లికేషన్లో వెయ్యికిపైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. చిన్నచిన్న క్విజ్లు సవాళ్లతో ప్రోగ్రామింగ్‌ను నేర్చుకోవడం కూడా సరదాగా మార్చేస్తుంది. మీరు నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. ఐఓఎస్‌పై కిండ్లేకి కొత్త సొబగులు! ఐ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అప్లికేషన్లు కొత్త కళను సంతరించుకొంటున్నాయి. ఐడివైజ్లను వాడే వాళ్లు ఐఓఎస్ 8కి అప్డేట్ అయితే అప్లికేషన్లు కొత్త అనుభవాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి అమెజాన్స్ కిండ్లే. ఐ డివైజ్‌లపై పుస్తకాలను చదివేందుకు కిండ్లే ఉత్తమమైన అప్లికేషన్. ఆన్లైన్ మెంబర్షిప్ ద్వారా పుస్తకాలు చదవడానికి అవకాశం ఇస్తుంది ఇది. కొత్త అప్డేట్స్తో కూడిన కిండ్లే అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకొంటే... వాడకం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఉన్నట్టుండి అప్లికేషన్ క్లోజ్ అయినా.. తర్వాత ఓపెన్ చేసుకొన్నప్పుడు డెరైక్ట్‌గా అదే పేజ్‌లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి మెరుగులతో కిండ్లే అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ఆప్: సెల్ నుంచే బిల్లు చెల్లించొచ్చు
బీఎస్ఎన్ఎల్ కొత్త అప్లికేషన్ సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ బిల్లును సెల్ నుంచే చెల్లించేందుకు ఉపయోగపడే కొత్త అప్లికేషన్(ఆప్)ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ‘మై బీఎస్ఎన్ఎల్ ఆప్’ అనే ఈ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్ బిల్లు మొత్తం ఎంతుందో తెలుసుకుని ఫోన్ ద్వారానే చెల్లించొచ్చు. అలాగే బ్యాలెన్స్ రీచార్జీ కూడా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను www.myapp.bsnl. co.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
కొత్త అప్లికేషన్ల ‘లాట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీకో మొబైల్ కావాలి. షాపుకెళ్లారు. వెళ్లి అక్కడి ప్రతినిధికి మీ వివరాలు చెప్పారు. మీరెలాంటి మొబైల్ కావాలనుకుంటున్నారో, దాన్లో ఏఏ ఫీచర్లు ఉండాలనుకుంటున్నారో... ధర ఎంతలో కావాలనుకుంటున్నారో ఆ ప్రతినిధికి చెప్పారు. టాబ్లెట్ పీసీలో ఆ వివరాలన్నీ నమోదు చేసిన ఆ ప్రతినిధి... సమాచారాన్ని వేరొక ప్రతినిధికి పంపాడు. కస్టమర్ దగ్గరకొచ్చిన ఆ ప్రతినిధి చేతిలోని ట్యాబ్లెట్లో... సదరు కస్టమర్ కోరిన ఫీచర్లతో, ఆ ధరలో ఏఏ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో అప్పటికే సిద్ధంగా ఉంది. ఈ కొత్త సాఫ్ట్వేర్ పేరే... స్మార్ట్ మ్యాచ్ మేకర్. సంక్షిప్తంగా ఎస్ఎంఎం. దీంతో పాటు ప్రతి మొబైల్‌కు, ట్యాబ్లెట్‌కు పక్కనే ఒక ఫీచర్ కార్డ్ జతచేసి ఉంటుంది. మొబైల్ షాప్ ప్రతినిధి తన చేతిలోని ట్యాబ్లెట్‌ను ఆన్ చేసి ఆ కార్డుపై పెట్టగానే... ఆ కార్డుకు జతచేసిన మోడల్ తాలూకు ఫీచర్లన్నీ వీడియో ద్వారా ప్రత్యక్షమవుతాయి. ఇది... వర్చువల్ రియాలిటీ. ఇండియాలో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ పద్ధతుల్ని తమ షాపుల్లో వినియోగిస్తున్నట్లు మొబైల్ దుకాణాల చైన్ ‘లాట్’ తెలియజేసింది. తమ షాపును సందర్శించిన ప్రతి కస్టమర్ ఈ విధానాల వల్ల వినూత్న అనుభూతికి లోనవుతారని, వారికి అభిరుచికి తగ్గ మోడల్ ఖచ్చితంగా దొరుకుతుందని శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ లాట్ ప్రతినిధి తెలియజేశారు. తమ టీమ్ ఆరునెలల పాటు శ్రమించి ఈ అప్లికేషన్లను తయారు చేసిందన్నారు.