‘ఈ-పెట్టి యాప్‌తో నేరాలకు చెక్‌’ | Telangana DGP Mahender Reddy Launches E Petti App | Sakshi
Sakshi News home page

‘ఈ-పెట్టి యాప్‌తో నేరాలకు చెక్‌’

Published Wed, Mar 14 2018 5:55 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Telangana DGP Mahender Reddy Launches E Petti App - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ -పెట్టి యాప్‌ ద్వారా చిన్న నేరాలకు చెక్‌ పెట్టవచ్చని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఈ-పెట్టి యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న నేరాలను అదుపులోకి తెచ్చినపుడే పెద్ద నేరాలు తగ్గుతాయని అందుకోసం ఈ యాప్‌ ఎంతగానో ఉపయోపడుతుందన్నారు. హైదరాబాద్ నగర పోలీసులు పైలెట్ వర్షన్‌గా అమలు చేసిన ఈ యాప్ సత్ఫలితాలిచ్చిందని తెలిపారు. రాష్డ్ర వ్యాప్తంగా ఈ యాప్ అమలులోకి వస్తుందని, పోలీసులు ట్యాబ్ ద్వారా అక్కడికక్కడే కేసు నమోదు చేయవచ్చన్నారు. 

డిజిటల్‌గా ఉండే ఆధారాలను ఇందులో పొందుపరచవచ్చని, ఒక వ్యక్తి క్రైం ట్రాక్ రికార్డ్ మొత్తం ఈ యాప్‌లో ఉంటుందన్నారు. ఇష్టమొచ్చినట్టుగా కేసులు పెట్టే ఆస్కారం లేకుండా సరైన సాక్ష్యాలు ఉంటేనే కేసు నమోదు చేసేలా ఈ టెక్నాలజీ రూపొందించారని ఆయన తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు ఈ-యాప్‌తో మరో ముందడుగువేశారు. దీంతో మేజర్, సీరియస్, పెట్టి కేసులను వెంటనే గుర్తించి... నేరాలను అదుపు చేసే అవకాశం ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement