cell phones robbery
-
రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ
కడప అర్బన్: ఓ కంటైనర్ నుంచి రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చోరీచేసి దానిని వదిలేసి వెళ్లిపోయిన దుండగుల ఉదంతం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఓ కంటైనర్ (హెచ్ఆర్ 38వై 3224)ను పదిరోజుల క్రితం కొందరు వదిలేసి వెళ్లారు. నిజానికి.. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఈ కంటైనర్ ముంబై, హైదరాబాద్, దువ్వూరు, నెల్లూరు మీదుగా చెన్నై చేరుకోవాల్సి వుంది. ఈ కంటైనర్‌లో ఎంతో విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను భద్రపరిచి, కోడింగ్‌తో లాక్‌చేసి మరీ నిర్వాహకులు ఎంతో పకడ్బందీగా పంపించారు. కానీ, ఈ కంటైనర్‌లోని రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను నిందితులు హైదరాబాద్–దువ్వూరు మార్గమధ్యంలో అపహరించారు. కంటైనర్ సకాలంలో చేరకపోయేసరికి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హైదరాబాద్–దువ్వూరు మధ్యలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కడప శివార్లలో కంటైనర్‌ను కనుగొన్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ చోరీలో కంటైనర్ డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ బి. వెంకటశివారెడ్డిని వివరణ కోరగా.. చోరీ జరిగిన విషయం వాస్తవమేనని, సోమవారం సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
సెల్ఫోన్ల దొంగ అరెస్ట్
మూడు సెల్ఫోన్లు స్వాధీనం నెల్లూరు (క్రైమ్) : ఓ మొబైల్ దుకాణంలో సెల్‌ఫోన్ దొంగతనానికి పాల్పడిన దొంగను బుధవారం మూడోనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ట్రంకురోడ్డులోని లాట్ మొబైల్ షాపులో ఈ నెల 15వ తేదీన గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. సెల్ఫోన్లు కొంటున్నట్లు నటిస్తూ రూ.38,239 వేలు విలువ చేసే శ్యామ్‌సంగ్ జె7, ఓపో మోడల్, మైక్రోమాక్స్ టాప్ సెల్ఫోన్లను అపహరించుకుని వెళ్లాడు. ఈ ఘటనపై షాపు మేనేజర్ ఈ నెల 25వ తేదీన మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ పి. రామకృష్ణ పరిశీలించారు. షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుడి ఛాయాచిత్రం లభ్యమైంది. దాని ఆధారంగా సెల్ఫోన్లను దొంగలించిన వ్యక్తి గూడూరు పట్టణం శాంతినగర్‌కు చెందిన పాలేటి నవీన్‌చంద్ర అలియాస్ నవీన్‌గా గుర్తించారు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు బుధవారం నిందితుడు బృందావనంలోని తిక్కన టెలిఫోన్ భవన్ వద్ద ఉండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
సెల్ఫోన్లు కొట్టేయడమే కాకుండా...
హైదరాబాద్: ఇళ్లల్లో సెల్ఫోన్లు చోరీ చేసి.. అందులో మహిళల నెంబర్లకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఓ కేటుగాడిని బాలానగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. బుధవారం బాలానగర్ సీఐ భిక్షపతిరావు, ఎస్ఐ ఎస్.వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అర్లపాడి గ్రామానికి చెందిన ముతుకుందు బ్రహ్మయ్య (27) బాలానగర్ ఫిరోజ్‌గూడలో ఉంటూ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గొడవ జరగడంతో ఇతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా,నగరంలో ఒంటరిగా ఉంటున్న బ్రహ్మయ్య బాలానగర్ పరిసరాల్లోని ఇళ్లల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తున్నాడు. ఆ ఫోన్లలోని మహిళల నెంబర్లకు ఫోన్ చేసి, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఓ బాధితురాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరికొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతికష్టం మీద నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.