యువకుడి అరెస్ట్.. 24 బైక్స్ స్వాధీనం
ఏలూరు(పశ్చిమగోదావరి): జల్సాలకు అలవాటుపడి దొంగతనాల బాటపట్టి ద్విచక్రవాహనాలను తస్కరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మడగల విజయ్‌కుమార్ గత కొన్ని రోజులనుంచి బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఓ బైక్ అమ్మడానికి యత్నిస్తుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. అతని వద్ద నుంచి చోరీ చేసిన 24 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.