హైదరాబాద్:చెలామణీలో లేని విదేశీ కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట్‌కు చెందిన వరప్రసాద్ అనే యువకుడు మైత్రీవనం సమీపంలో శనివారం మధ్యాహ్నం టర్కీ దేశ కరెన్సీ లిరాలను మార్పిడి చేసుకునేందుకు యత్నించాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 89 లిరా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ల విలువ రూ.100 కోట్లు ఉంటుందని, అయితే అవి ఇప్పుడు చెల్లుబాటు కావని చెబుతున్నారు. ఈ కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విదేశీ కరెన్సీ స్వాధీనం..ఒకరి అరెస్ట్
Published Sat, Jun 25 2016 1:38 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement