హైదరాబాద్: ప్రేమ వ్యవహారం చివరికి కత్తితో దాడికి దారి తీసింది. ఈ సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చివరికి కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.....కాకతీయనగర్‌కు చెందిన టి. వినయ్ కొన్ని రోజుల నుంచి సమతానగర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి సోదరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ విషయమై మంగళవారం భాస్కర్‌రెడ్డి, వినయ్ మధ్య వాగ్వివాదం జరిగింది.
దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన భాస్కర్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్‌పై దాడి చేశాడు. దీంతో వినయ్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.