
సాక్షి, కరీంనగర్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలంలో ఓ యువకుడి కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుడితోపాటు ఆమె తల్లి, తండ్రిని కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రేమ వ్యవహారంతోనే యువతి బంధువులు కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది.
చిగురుమామిడి మండలానికి చెందిన చందు అనే యువకుడు జగిత్యాలకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న యువతి అన్నయ్య.. తన స్నేహితులతో కలిసి చందు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడితో పాటు అతడి తండ్రి శ్రీనివాస్, తల్లి స్వప్నకు కూడా గాయాలయ్యాయి. అంతేగాక చందు శరీరంలోనే కత్తి చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చదవండి: హైదరాబాద్ మలక్‌పేట్‌లో దారుణం.. డాక్టర్ శ్రావణి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment