![న్యూడుల్స్ ఫ్యాక్టరీ సీజ్](/styles/webp/s3/article_images/2017/09/3/41432216605_625x300_1.jpg.webp?itok=Ot0dOsxn)
న్యూడుల్స్ ఫ్యాక్టరీ సీజ్
హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో ఓ న్యూడుల్స్ ఫ్యాక్టరీని పోలీసులు సోమవారం సీజ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్స్ పొందకుండా ఫ్యాక్టరీని నడుపుతున్నందుకు హమీద్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 14 వందల కేజీల నూడుల్స్, 18 వందల కేజీల మైదా, ఒక వెయింగ్ మెషిన్, 9 వందల కేజీల లూజ్ న్యూడుల్స్, నూడుల్స్ తయారు చేసే ఓ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.