factory seized
-
అక్రమ ఆయుధ కర్మాగారం .. ఇద్దరు అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఆయుధ తయారీ పరిశ్రమను పోలీసు అధికారులు కనుగొన్నారు. ఉత్తర 24 పరగణాలలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ మామిడి తోటలో దీన్ని నిర్వహిస్తున్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంపై మంగళవారం దాడి చేసి టెంట్ కింద కర్మాగారం నిర్వహిస్తున్న కుములియా ప్రాంతానికి చెందిన సుదామ్ మజుందార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రదేశం నుంచి తొమ్మిది తుపాకులను, ఆయుధాల తయారీకి ఉపయోగించే విడి భాగాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా వీటిని స్థానికంగా తయారు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ ఆయుధాల తయారీలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి బరాసత్ జిల్లా కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు జిల్లా సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
న్యూడుల్స్ ఫ్యాక్టరీ సీజ్
హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో ఓ న్యూడుల్స్ ఫ్యాక్టరీని పోలీసులు సోమవారం సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ పొందకుండా ఫ్యాక్టరీని నడుపుతున్నందుకు హమీద్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 14 వందల కేజీల నూడుల్స్, 18 వందల కేజీల మైదా, ఒక వెయింగ్ మెషిన్, 9 వందల కేజీల లూజ్ న్యూడుల్స్, నూడుల్స్ తయారు చేసే ఓ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.