క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బికే గూడలో బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, రెండు ఎల్‌ఈడీ టీవీలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.