
సాక్షి, హైదరాబాద్: ఏపీ టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ నేత రవికిరణ్ రెడ్డితో పాటు అజయ్‌రెడ్డి, అప్పన్న, కోటిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో క్రికెట్ బుకీ వెంకిబాబు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన వారి నుంచి రూ.15 లక్షల నగదు, కారు, టీవీ, 41 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై శనివారం మధ్యాహ్నం పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment