చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన ఎస్ఐ | si mahender reddy caught redhanded by meerpet police | Sakshi
Sakshi News home page

చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన ఎస్ఐ

Published Fri, Oct 14 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

si mahender reddy caught redhanded by meerpet police

హైదరాబాద్: సామాన్య ప్రజలను దొంగల భయం నుంచి రక్షించాల్సిన ఓ పోలీస్ చోరీలకు పాల్పడుతున్నాడు. కథ అడ్డం తిరగడంతో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నగరంలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఆ వివరాలిలా ఉన్నాయి.. మహేందర్ రెడ్డి నగరంలో సీసీఎస్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే నేటి(శుక్రవారం) ఉదయం మహేందర్ రెడ్డి మీర్ పేట ఏరియాలో దొంగతనానికి యత్నించాడు. సరిగా అదే సమయంలో మీర్ పేట పోలీసులకు మహేందర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మహేందర్ రెడ్డిని మీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement