
సాక్షి, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మీర్‌పేట పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ(25) తన స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబు (23)తో కలిసి మీర్‌పేట టీకేఆర్ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది.
సులువుగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు అక్టోబరు 13వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు గంధ భవానీ, కసిరెడ్డి దొరబాబును అరెస్ట్ చేసి.. నగరానికి చెందిన ఇద్దరు మహిళలను రక్షించారు. భవిష్యత్‌లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా సీపీ ఆదేశాల మేరకు పోలీసులు భవానీ, దొరబాబుపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.
చదవండి: మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment