బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడగా.. అందులో ఒకరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
పహాడీషరీఫ్ (హైదరాబాద్): బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడగా.. అందులో ఒకరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 18న బాలాపూర్ బిస్మిల్లా కాలనీలో 13 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లోనే రాషేద్, అక్బర్ ఖాన్(30) అత్యాచారం చేశారు. జరిగిన దారుణంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుక్ను పోలీసులు అక్బర్ ఖాన్‌ను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.