లూసీ, సోహా తబుస్సుం
సిద్దిపేటజోన్ : లూసీ అంటే వారికి ఎంతో ప్రేమ, అభిమానం. రెండేళ్లుగా వారింట్లో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయింది. ముఖ్యంగా ఆ ఇంటి చిన్నారులకు ఆ పిల్లి అంటే చాలా ఇష్టం. అంతటి అభిమానాన్ని పొందిన లూసీ విదేశీ రకం పిల్లి కావడం విశేషం. కొందరు తమ ఇళ్లల్లో శునకాలు, కుందేళ్లు, ఇతర పెంపుడు జంతువులపై ప్రేమ చూపించడం సహజం. కానీ, మరికొందరు పిల్లులు అంటే వల్లమాలిన అభిమానం చూపుతారు. మూఢనమ్మకాలను పక్కన బెట్టి.. రోజంతా వాటితో సరదాగా గడుపుతారు. అలాంటి కోవకు చెందిన వారే సిద్దిపేటలోని మంగమ్మతోట కాలనీకి చెందిన ప్రభుత్వం ఉద్యోగి అస్కర్.
రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి..
అస్కర్‌తో పాటు వారి పిల్లలైన కబీర్, ఫర్మాన్, సోహాతబుసంకు పిల్లలంటే చాలా ఇష్టం. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లారు. అక్కడ వారికి ఒక అందమైన విదేశీ పిల్లి కలివిడిడా తిరగడం కనిపించింది. దీంతో ఆ బ్రీడ్ వివరాలు తెలుసుకొని.. రూ.20 వేలు ఖరీదు చేసి పెర్షియన్ క్యాట్(విదేశీ పిల్లి జాతి)ను కొనుగోలు చేశారు. అచ్చం కుక్కపిల్ల తరహాలో కనిపించే ఈ పిల్లికి లూసీ పేరు పెట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో లభించే ఆహారంతో పాటు.. వారంలో రెండుసార్లు మాంసం లూసీకి అందిస్తున్నారు. అంతేకాకుండా రూ.2 వేలతో అన్ని వ్యాక్సిన్లు వేయించారు.
లూసీ అంటే ప్రాణం
మాకు లూసీ అంటే ప్రాణం. నా పిల్లలు దానిని విడిచిపెట్టి ఉండలేరు. రెండేళ్ల క్రితం చిన్న పిల్లగా ఉన్నప్పుడే కొనుగోలు చేశా. దాని నిర్వహణకు ప్రతి నెల రూ.2 వేలు వెచ్చిస్తున్నా. ప్రస్తుతం మా కుటుంబంలో అది కూడా ఓ భాగం. చుట్టుపక్కల వారు దాన్ని పిల్లి అంటే నమ్మరు. – అస్కర్
Comments
Please login to add a commentAdd a comment