
జనావాసాల మధ్యే ఆయుధాల తయారీ!
ఒడిశాలో అక్రమ ఆయుధాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు చందంగా కొనసాగుతోంది.
భువనేశ్వర్: ఒడిశాలో అక్రమ ఆయుధాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు చందంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో జనావాసాల మధ్యే అక్రమ ఆయుధ తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. అంగూల్ జిల్లా బడాపడాలో అక్రమంగా ఆయుధాలను తయారుచేస్తున్న ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు బీహార్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. ఆయుధ తయారీ కేంద్రం నుంచి 31 దేశీయ తుపాలకులతో పాటు 5 వందల బుల్లెట్స్, గన్ మెటీరియల్‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారం మేరకు మరిన్ని అక్రమ ఆయుధ కేంద్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్రమ ఆయుధాల తయారీ వెనక కొన్ని సంస్థల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. .