ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన జీఎంఆర్ వాటా | rise in the share of GMR Delhi Airport | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన జీఎంఆర్ వాటా

Published Thu, Mar 26 2015 12:59 AM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన జీఎంఆర్ వాటా - Sakshi

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన జీఎంఆర్ వాటా

10 శాతం వాటాను రూ. 492 కోట్లకు కొన్న జీఎంఆర్
పూర్తిగా వైదొలిగిన మలేషియా ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్
దీంతో 64 శాతానికి పెరిగిన వాటా జీఎంఆర్ వాటా

 
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(డీఐఏఎల్) నుంచి విదేశీ భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెరహాద్ (ఎంఏహెచ్‌బీ) పూర్తిగా వైదొలిగింది. ఎంఏహెచ్‌బీ కలిగి ఉన్న 10 శాతం వాటాను సుమారు రూ. 492 కోట్లు (7.9 కోట్ల డాలర్లు) జీఎంఆర్ ఇన్‌ఫ్రా కొనుగోలు చేసింది. దీంతో డీఐఏఎల్‌లో జీఎంఆర్ వాటా 54 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. ప్రస్తుత చట్టాల ప్రకారం విదేశీ భాగస్వామ్య కంపెనీకి యాజమాన్య నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడంతో వైదొలుగుతున్నట్లు మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ ప్రకటించింది.

సుమారు 22 మిలియన్ డాలర్ల లాభంతో ఎంఏహెచ్‌బీ వైదొలిగినట్లు అంచనా. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎంఏహెచ్‌బీ 57.6 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మలేషియా ఎయిర్‌పోర్ట్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కీలకమైన ఎయిర్‌పోర్ట్‌లో వాటా పెంచుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిదార్థ కపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఈ వాటా కొనుగోలుకు ఎయిర్‌పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించాల్సి ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement