Malaysia Airports Holdings berahad
-
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ చేతికి మలేసియా సంస్థ వాటా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ సంస్థ జీఎంఆర్ గ్రూప్.. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వాటాను 74 శాతానికి పెంచుకోనుంది. మలేసియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ బెర్హాద్ (ఎంఏహెచ్బీ) నుంచి 11 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు జీఎంఆర్ 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 831 కోట్లు) వెచి్చంచనుంది. జీఎంఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కన్సార్షియం.. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)కు జీహెచ్ఐఏఎల్ అనుబంధ సంస్థకాగా.. ఎంఏహెచ్బీతో వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కీలక ఆస్తులను కన్సాలిడేట్ చేయడంలో భాగంగా తాజా వాటా కొనుగోలుకి తెరతీసినట్లు జీఎంఆర్ గ్రూప్ తెలియజేసింది. ప్రస్తుతం జీహెచ్ఐఏఎల్లో జీఏఎల్కు 63 శాతం వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 13 శాతం చొప్పున వాటా ఉంది. -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెరిగిన జీఎంఆర్ వాటా
10 శాతం వాటాను రూ. 492 కోట్లకు కొన్న జీఎంఆర్ పూర్తిగా వైదొలిగిన మలేషియా ఎయిర్పోర్ట్ లిమిటెడ్ దీంతో 64 శాతానికి పెరిగిన వాటా జీఎంఆర్ వాటా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(డీఐఏఎల్) నుంచి విదేశీ భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ బెరహాద్ (ఎంఏహెచ్బీ) పూర్తిగా వైదొలిగింది. ఎంఏహెచ్బీ కలిగి ఉన్న 10 శాతం వాటాను సుమారు రూ. 492 కోట్లు (7.9 కోట్ల డాలర్లు) జీఎంఆర్ ఇన్ఫ్రా కొనుగోలు చేసింది. దీంతో డీఐఏఎల్లో జీఎంఆర్ వాటా 54 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. ప్రస్తుత చట్టాల ప్రకారం విదేశీ భాగస్వామ్య కంపెనీకి యాజమాన్య నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడంతో వైదొలుగుతున్నట్లు మలేషియన్ ఎయిర్పోర్ట్స్ ప్రకటించింది. సుమారు 22 మిలియన్ డాలర్ల లాభంతో ఎంఏహెచ్బీ వైదొలిగినట్లు అంచనా. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎంఏహెచ్బీ 57.6 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మలేషియా ఎయిర్పోర్ట్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కీలకమైన ఎయిర్పోర్ట్లో వాటా పెంచుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిదార్థ కపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఈ వాటా కొనుగోలుకు ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించాల్సి ఉంది.