విదేశీ మద్యం స్వాధీనం..మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్ | former mlc arrested in hyderabad due to Possession of foreign alcohol | Sakshi
Sakshi News home page

విదేశీ మద్యం స్వాధీనం..మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్

Published Sat, Jun 25 2016 1:02 PM | Last Updated on Thu, Oct 4 2018 7:50 PM

విదేశీ మద్యం స్వాధీనం..మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్ - Sakshi

విదేశీ మద్యం స్వాధీనం..మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్

హైదరాబాద్: నగరంలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ కేసులో సంబంధమున్న ఓ మాజీ ఎమ్మెల్సీతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
నారాయణగూడ, గాంధీనగర్, మీర్‌చౌక్, మంగళ్‌హాట్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది 7,255 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 1.71 కోట్ల వరకు ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య అలియాస్ రాధయ్యతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. గతంలో రాధయ్య ఆర్టీసీ పాలకవర్గ సభ్యుడిగాను, కార్మిక సంఘం నేతగా పనిచేశారు. ఈ మద్యం ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement