
బంగ్లాదేశ్‌లో విదేశీ జెండాలకు రెడ్‌కార్డ్
ఢాకా: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సాకర్ ఫీవర్.. క్రికెట్ అంటే పడిచచ్చే బంగ్లాదేశ్‌లో సాకర్ మానియా మరీ ఎక్కువగా ఉంది. ప్రపంచకప్ కోసం ఎప్పుడెప్పుడాని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొందరైతే తమ అభిమానాన్ని బహిరంగంగా చాటుకుంటున్నారు. రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వేలాది మంది తాము అభిమానించే జట్ల దేశాల జెండాలను ఇళ్లపై ప్రదర్శిస్తున్నారు.
సాకర్ మోజులో విదేశీ జెండాలను డాబాలపై ప్రదర్శించడం అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే ఇళ్లపై ఏ దేశానికి చెందిన జెండాను ప్రదర్శించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే అభిమానులు మాత్రం అధికారుల హెచ్చరికలను పట్టించుకోవడం లేదు