రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి వెంట ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి.. పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న యువకులు కూడా గాయపడ్డారు. కారును నడిపింది మైనర్ బాలుడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.