సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉండగా.. నగరంలోని జంట జలాశయాలకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేయనున్నారు అధికారులు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయనున్నారు.
ఇక, ఇప్పటికే అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో, మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో మూసీ ఏడు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ప్రస్తుతం మూసీ పరిస్థితి..
ఇన్ ఫ్లో: 13140 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 10047 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు
ప్రస్తుత మట్టం: 642.40 అడుగులు
పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 3.79 టీఎంసీలు.
ఇది కూడా చదవండి: భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు
Comments
Please login to add a commentAdd a comment