Usman Sagar
-
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులు.. మూసీతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. నగరంలోని జంట జలాశయాలకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేయనున్నారు అధికారులు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయనున్నారు. ఇక, ఇప్పటికే అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో, మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో మూసీ ఏడు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మూసీ పరిస్థితి.. ఇన్ ఫ్లో: 13140 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 10047 క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు ప్రస్తుత మట్టం: 642.40 అడుగులు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 3.79 టీఎంసీలు. ఇది కూడా చదవండి: భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు -
కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల
మొయినాబాద్: జీవో 111 ఎత్తివేతకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఆ జీవో పరిధిలోని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ 26 ఏళ్ల కల నెరవేరనుందని, అభివృద్ధికి అడ్డు తొలగిపోనుందని స్థానికులు చెబుతున్నారు. 84 గ్రామాల్లోని సుమారు లక్షా 32 వేల ఎకరాల భూ మికి విముక్తి లభిస్తుందని అంటున్నారు. నిజాం కాలంలో హైదరాబాద్‌కు తాగునీరు అందించడం కోసం నిర్మించిన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీళ్లు కలుషితం కాకుండా ఉండటం కోసం 1996లో అప్పటి ప్రభు త్వం 111 జీవోను తీసుకొచ్చింది. జలాశయాల ఎగువ ప్రాంతంలోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చి కొన్ని నిబంధనలను విధించింది. అయితే దీనివల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి కుం టు పడుతోందని, భూములకు ధరలు పెరగడం లేదని స్థానిక రైతులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. జీవో ఎత్తివేయాలనే డిమాండ్ స్థానికంగా మరింత ఊపందుకోవడంతో ఎన్నికల సమయంలో రాజ కీయ పార్టీలు ఈ మేరకు హామీ ఇచ్చాయి. సీఎం కేసీఆర్ కూడా జీవో 111 ఎత్తివేతకు హామీ ఇచ్చా రు. (చదవండి: హెచ్చార్సీలో మంత్రి హరీశ్‌రావుపై కేసు ) ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం అసెంబ్లీలో.. హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం కృష్ణా, గోదా వరి నీళ్లు సరఫరా అవుతున్నందున జంట జలాశయాల నీటిని వినియోగించడంలేదని, అందువల్ల జీవో 111ను ఎత్తేస్తామని ప్రకటించారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో జీవో పరిధిలోని రైతులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మొయినాబాద్ మండల కేం ద్రంతో పాటు పలు గ్రామాల్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. 111 జీవో ఎత్తివేతతో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని, అభివృద్ధి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభపరిణామం: ఎంపీ రంజిత్‌రెడ్డి జీవో 111 ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవ డం శుభ పరిణామమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తివేతపై హామీ ఇచ్చారని.. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొ న్నారు. చేవెళ్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 26 ఏళ్ల కల సాకారం అవుతోంది జీవో 111 కారణంగా తమ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు చెందిన కొత్త నర్సింహారెడ్డి చెప్పారు. ఆ జీవో ఎత్తేయాలని ఏళ్ల తరబడి పోరాటాలు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో జీవో రద్దు కానుండటంతో 26 ఏళ్ల కల ఇప్పుడు సాకారం అవుతోందని చెప్పారు. (చదవండి: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) -
జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపం
బంజారాహిల్స్: హైదరాబాద్‌కు ఒక వరంగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్లకు రక్షణకవచమైన జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపంగా మారుతుందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సారావత్ అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోపోతే పర్యావరణ ప్రేమికులు, చెరువుల పరిరక్షకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితం జీవో 111 రద్దు చేస్తామని, ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. లుబ్నా సారావత్ మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని, కమిటీని ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్ధాలే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని సారావత్ దుయ్యబట్టారు. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్ కాలుష్యమయం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువులు వరదలను ఆపడమే కాకుండా ఎన్నో వనరులకు కేంద్ర బిందువుగా ఉన్నాయని, శక్తి మేర నగరవాసుల దాహార్తి తీరుస్తున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరగడానికి, హైదరాబాద్ చుట్టూ ప్రకృతి విరాజిల్లడానికి కారణమవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి మద్దతు కూడగడతామని, ప్రజలకు వీటి అవసరాన్ని గుర్తు చేస్తామని వెల్లడించారు. ఐఏసీటీ విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రకృతికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే, వాటి దుష్పరిణామాలు తట్టుకోలేరన్నారు. ప్రజలందరితో చర్చించిన తర్వాతనే జీవో 111పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
Usman Sagar: విస్తీర్ణానికి ‘గండి’!
సాక్షి, హైదరాబాద్: శతాబ్ద కాలంగా మహానగర దాహార్తిని తీరుస్తున్న గండిపేట (ఉస్మాన్‌సాగర్) విస్తీర్ణం తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ జలాశయ విస్తీర్ణంపై హెచ్ఎండీఏ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్, జలమండలి నుంచి గతంలో సేకరించిన మ్యాప్‌లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వీటి ప్రకారం చూస్తే జలాశయ విస్తీర్ణం (ఎఫ్టీఎల్ పరిధి) సుమారు 300 ఎకరాల మేర తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యత్యాసంపై వ్యాజ్యం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిపై 2019లో హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు సర్వే నిర్వహించి ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్ విడుదల చేశాయి. గండిపేట జలాశయం విస్తీర్ణం 6,039 ఎకరాలని పేర్కొన్నాయి. అయితే పలువురు పర్యావరణవేత్తలు 2014లో సమాచార హక్కు చట్టం కింద జలమండలి నుంచి గండిపేట ఎఫ్టీఎల్కు సంబంధించిన మ్యాపులను సేకరించారు. ఇందులో జలాశయం విస్తీర్ణం 6,335.35 ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పర్యావరణవేత్తలు రెండు మ్యాప్‌ల మధ్య తేడాకు కారణాలు ఏమిటన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయం విస్తీర్ణం తగ్గితే నీటినిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, లేఅవుట్లు చేపట్టకూడదని 1996 మార్చి 8న జారీచేసిన జీవో నంబర్ 111 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 111 నంబర్ జీవోకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా నివేదిక సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల నేపథ్యంలో.. జంట జలాశయాల పరిరక్షణ చర్యలు, 111 జీవోలో మార్పులు చేర్పులను సూచించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, దానకిశోర్, ఎస్కే జోషీ ఈ కమిటీలో ఉన్నారు. ఆక్రమణలే శాపం ఆరేళ్ల కిందట పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సర్వేలో జీవో 111లో పేర్కొన్న 84 గ్రామాలకు సంబంధిచిన వేలాది ఎకరాల్లో 418 అక్రమ లే అవుట్లు, 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. మరో 5,202 వ్యక్తిగత గృహాలు కూడా కలిపి మొత్తం 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సర్వే తేల్చింది. జంట జలాశయాలకు ఇన్‌ఫ్లో రాకుండా పలు లే అవుట్లు, ఇతర నిర్మాణాల చుట్టూ భారీ గోడలు నిర్మించారు. జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో పలువురు ప్రముఖులు ఏర్పాటు చేసిన ఫామ్‌హౌస్‌లు కూడా శాపంగా పరిణమించాయి. సమగ్ర విచారణ చేపట్టాలి గతంలో జలమండలి నుంచి మేము సేకరించిన మ్యాపులు.. హెచ్ఎండీఏ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గినట్లు కనిపిస్తుంది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మూడుసార్లు లేఖ రాశాం. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి గండిపేటతో పాటు హిమాయత్‌సాగర్ జలాశయాన్నిక కూడా పరిరక్షించాలి. – లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త -
జంట జలాశయాలు నిష్ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా తాగునీరు అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ రెండు జలాశయాలు కూడా నిష్ప్రయోజనకరంగా మారాయని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ జలాశయాల వల్ల తాగునీరు తగినంత అందడం లేదని, కృష్ణా జలాలనే తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ జంట జలాశయాల పరిధిలో జీవో 111కు విరుద్ధంగా భారీ ఎత్తున వెలసిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఎదుట ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో ఏఏజీ స్పందిస్తూ, జీవో 111పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 111 జీవో పరిధిలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయని, వీటి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అలాగే జీవో 111 చట్టబద్ధతను సవాలు చేస్తూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏఏజీ వాదనలు వినిపిస్తూ జంట జలాశయాలు నిష్ప్రయోజనకరంగా మారాయని కోర్టుకు నివేదించారు. -
మురుగు మరుగయ్యేనా!
జంట జలాశయాల్లో కలుస్తున్న ఎగువ ప్రాంతంలోని మురుగు మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు శూన్యం శంషాబాద్ రూరల్: నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ‘మురుగు’ పెద్ద సమస్యగా మారింది. మురుగునీరు జలాశయాల్లోకి చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో జీఓ 111 అమలులో ఉండగా ఎగువ ప్రాంతం గ్రామాల్లోని మురుగంతా వరదనీటితో పాటు జలాశయాల్లో కలుస్తోంది. ఆయా గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. దీంతో జలాశయాల్లోని నీరు కలుషితమవుతోంది. వర్షాకాలంలో వరదనీటితోపాటు మురుగంతా జలాశయాల్లోకి చేరుతోంది. శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల పరిధిలోని 84 గ్రామాల్లో జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆయా గ్రామాల మీదుగా వచ్చే వరదనీరు వాగులు, కాలువల ద్వారా జంట జలాశయాల్లో కలుస్తోంది. వీటికి ఈసీ, మూసీ వాగుల నుంచి వచ్చే వరదనీరు ప్రధానమైనది కాగా సమీపంలో ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు నేరుగా వీటిల్లోకి చేరుతోంది. గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో మురుగును స్థానికంగా ఉన్న చిన్నపాటి గుంతలు, పొలాలు, చెరువులు, కుంటల్లోకి వదిలేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మురుగు కాలువలను నేరుగా వరదకాలువలు, వాగులు, చెరువుల్లోకి కలిపేస్తున్నారు. నోటీసులతో సరి.. శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో ఇబ్బడి ముబ్బడిగా విద్యా సంస్థలు ఏర్పాటు కాగా వీటి నుంచి వెలువడే మురుగు జలాశయాల్లో కలుస్తోంది. పరీవాహక ప్రాంతంలో ఉన్న సుమారు 50 ఇంజినీరింగ్, ఇతర విద్యా సంస్థలను మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని పీసీబీ గతంలో నోటీసులు జారీ చేసింది. తర్వాత వీటి గురించి పట్టించుకునే వారు లేక ఆచరణ అమలు సాధ్యం కావడంలేదు. దీనికి తోడు గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనావాసాల సంఖ్య గత 20 ఏళ్లలో రెట్టింపు అయింది. అక్కడి జనాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికే పంచాయతీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. వీటికి తోడుగా మురుగు శుద్ధి ఇప్పుడు పెద్దసమస్యగా మారింది. నిధుల కొరతతో.. జీఓ 111 నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేదిస్తోంది. పంచాయతీ నిధులతో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చే సుకోవాలని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఒక్కో మురుగు శుద్ధి కేంద్రానికి సుమారు రూ.20 లక్షల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు గ్రామాల్లో అనువైన స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో సొంత ఖర్చులతో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు పంచాయతీలు ముందుకు రావడంలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామాల్లో మురుగును నేరుగా వరదకాలువల్లోకి వదలుతున్నారు. జంట జలాశయాలకు ఎగువ ప్రాంతంలోని గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి కృషి జరగడంలేదని సర్పంచులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాల్లో సమస్య జటిలం.. జంట జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు సమస్య జటిలంగా మారింది. శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ, కవ్వగూడ, నర్కూడ, సుల్తాన్‌పల్లి, కె.బి.దొడ్డి, మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ, అజీజ్‌నగర్, అమ్డాపూర్, బాకారం, వెంక టాపూర్, నక్కలపల్లి, చిన్నమంగళారం, చిలుకూరు, రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్, వట్టినాగులపల్లి తదితర గ్రామాల్లోని మురుగు జలాశయాల్లో కలుస్తోంది. జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు జలమండలి ప్రణాళికలు రూపొందించినా అమలు కావడంలేదు. సుమారు రూ.35 కోట్ల నిధులతో మినీ ఎస్టీపీ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు గతంలోనే ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
నాడు ఆదర్శం.. నేడు రాజకీయం
రామచంద్రాపురం: జిల్లాలో ఒకప్పుడు ఆదర్శ పంచాయతీగా పేరొందిన ఉస్మాన్‌నగర్ ఇప్పుడు రాజ కీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో వార్తల్లోకెక్కింది. సర్పంచ్ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తుండగా, సర్పంచ్‌తో పాటు ఆమె మద్దతు దారులు పంచాయతీ నిధులు ఒక్కపై సా కూడా పక్కదారి పట్టలేదని చెబుతున్నారు. ప్రేమ్‌కుమార్ ఫిర్యాదుతో... ఉస్మాన్‌నగర్ సర్పంచ్ కల్పన లక్షలాది రూపాయల గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన జిల్లా పంచాయతీరాజ్ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆగ స్టు 20న గ్రామ పంచాయతీని సందర్శించి విచారణ నిర్వహించారు. అనంతరం రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. అయితే డీపీఓ పంచాయతీ నిధులతో నిర్మించిన మహిళా భవనాన్ని సందర్శించలేదని మరోసారి ఫిర్యాదు చేయడంతో నవంబర్ 20న డీఎల్పీఓ మనోహర్ గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాల ఆరోపణలను రికార్డు చేసుకొని వెళ్లారు. నోటీసులు..సంజాయిషీ అంతకుముందు డీపీఓ అక్టోబర్ 15న సర్పంచ్ కల్పనకు సుమారు రూ. 24 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో కొన్నిం టికి ఎంబీ రికార్డులు లేవని, మరి కొన్ని కొనుగోళ్లకు నేరుగా డబ్బులు చెల్లించారని దానిపై సంజాయిషీ ఇవ్వాలని షోకాజ్ నోటీసు ఇచ్చారు. దానిపై స్పందించిన సర్పంచ్ కల్పన అక్టోబర్ 22న తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇస్తూ సంజాయిషీ లెటర్‌ను పం పారు. తాను ఖర్చు చేసిన ప్రతి పైసాకు సంబంధించిన రశీదులున్నాయని డీపీఓకు ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఒకనాడు జిల్లాకే ఆదర్శంగా ఉన్న గ్రామం నేడు రాజకీయ ఆరోపణలతో వార్తల్లోకెక్కడం గ్రామస్తులకు మింగుడు పడటం లేదు. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా ఉన్నతాధికారులు వివరాలు వెళ్లడిస్తే కానీ అసలు విషయం బయటపడదు. రాజకీయ లబ్ధికోసమే ఆరోపణలు రాజకీయ లబ్ధికోసమే నాపై ఆరోపణలు చేస్తున్నారు. స్పెషల్ అధికారుల పాలనలో ప్రభుత్వ భూములలో రోడ్లు వేస్తే అది కూడ నేనే చేశాననడం దారుణం. నేను బాధ్యతలు చేపట్టినప్పుడు గ్రామ పంచాయతీలో రూ. 63 లక్షల నిధులు ఉన్నాయి. పంచాయతీ అధికారుల అనుమతుల మేరకు అభివృద్ధి పనులు చేశాం. కూర్చునేందుకు కుర్చీ కొన్నా, అవినీతంటే ఏం చేయాలి. -కల్పన, సర్పంచ్ విచారణ సరిగ్గా జరగడం లేదు గ్రామ సర్పంచ్ పం చాయతీ నిధులను దుర్వినియో గం చేశా రు. దీనిపై మేము జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ అధికారులు చేస్తున్న విచారణ తీరు సరిగ్గా లేదు. ప్రభుత్వ భూముల్లో రో డ్డు వేశారని మేము అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల సీసీ రోడ్డుపై సీసీ రోడ్డు వేశారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి. - ప్రేమ్ కుమార్, ఫిర్యాదుదారుడు -
111 జీవో కరెక్టే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 111 జీవోను సవరిస్తే జిల్లాలోని జంట జలాశయాల అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని నీటి పారుదలశాఖ తేల్చిచెప్పింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలోని 86 గ్రామాలను జీవ పరిరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)గా పరిగణిస్తూ 1996లో రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను జారీచేసింది. జంటనగరాల దాహార్తిని తీర్చే ఈ జలాశయాలకు వరద నీరు సులువుగా చేరాలంటే ఆంక్షలు తప్పనిసరని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని 86 గ్రామాలను 111 జీవో పరిధిలోకి తెచ్చింది. అయితే, తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందని, దీన్ని వెంటనే సవరించాలని చాలా ఏళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూ క్రయ విక్రయాలు, నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ ఉత్తర్వులను సడలించాలని కోరుతున్నారు. అయితే, జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే అంశంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినందున... గత పాలకులు కూడా దీనిని సవరించే ందుకు సాహసించలేదు. ఒకవైపు బడాబాబులు, సినీరంగప్రముఖులు, ప్రజాప్రతినిధులు మాత్రం జీవోను అదనుగా చేసుకుని అడ్డగోలుగా ల్యాండ్‌బ్యాంకును సమకూర్చుకున్నారు. కారుచౌకగా భూములు లభించడంతో రిసార్టులు, ఫామ్‌హౌజ్‌లను నెలకొల్పుకున్నారు. సవరణ కుదరదు 111 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినందున... జీవో ఎత్తివేత , సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాస్త్రీయత పాటించకుండా అప్పట్లో జీవో జారీ చేశారని, దిగువ ప్రాంతాలపై కూడా అంక్షలు విధించారనే ఆరోపణలున్నందున.. అవి నిజమైతే కనీసం ఆ గ్రామాలకైనా జీవోనుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భావించారు. ఈ అంశంలో పర్యావరణ, సామాజిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యోచించారు. శాసనసభ సమావేశాలనంతరం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు అందుకున్న జిల్లా కలెక్టర్... బయో కన్జర్వేషన్ జోన్‌ను పునఃసమీక్షించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇరిగేషన్ శాఖతో ప్రత్యేక సర్వే చేయించారు. 111 జీవో వర్తింపజేస్తున్న 86 గ్రామాలు జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయని, శాస్త్రీయంగానే ఈ గ్రామాలపై ఆంక్షలు విధించారని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఏ మాత్రం అంక్షలు సడలించినా.. ఈ జలాశయాల ఉనికి దెబ్బతింటుందని తెగేసి చెప్పింది. ఈ మేరకు తమకు నివేదిక అందజేసినట్లు జిల్లా ముఖ్యఅధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. -
సాగర్ ప్రక్షాళనకు మళ్లీ బ్రేక్
=వ్యర్ధాల డంపింగ్‌పై పీసీబీ అభ్యంతరం =హెచ్ఎండీఏకు తాజాగా నోటీసులు జారీ =గుట్టలుగా పేరుకుపోతున్న వెలికి తీసిన వ్యర్థాలు సాక్షి, సిటీబ్యూరో: సాగర్ ప్రక్షాళన ప్రహసనంగా మారింది. ప్రమాణాలు పాటించకుండా సాగర్ వ్యర్థాలను క్వారీల్లో డంప్ చేయడంపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ప్రక్రియను తక్షణం నిలిపేయాలంటూ హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం (20న) పీసీబీ కార్యాలయానికి రావాలని హెచ్ఎండీఏ అధికారులకు సూచిం చింది. ఫలితంగా సాగర్ వ్యర్థాల తరలింపు ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటివరకు వెలికితీసిన వ్యర్థాలు ప్రస్తుతం సంజీవయ్య పార్కులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థంకాక అధికారులు జుట్టు పీక్కొంటున్నారు. ఆది నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటున్న సాగర్ శుధ్ది కార్యక్రమం ఎప్పటికి పూర్తవుతుందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగి లింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగం గా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలా, కూకట్పల్లి నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన వ్యర్థాలు వెలికి తీయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. తొలిదశలో భాగంగా బంజారా, బల్కాపూర్, పికెట్ నాలా వద్ద 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను తొలగించేందుకు నడుం బిగించింది. తొలుత పికెట్ నాలా వద్ద డ్రెడ్జింగ్ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించింది. సాగర్ నుంచి వెలికి తీసిన వ్యర్థాలను జవహర్‌నగర్‌కు తరలించాలనుకొన్నారు. అయితే... స్థానిక ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ వెనుక ఉన్న క్వారీలను ఇందుకోసం ఎంపిక చేశారు. అక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో శివారులోని గాజులరామారం వద్ద 2.5 ఎకరాల్లోని క్వారీలను డంప్ సైట్‌గా నిర్ణయించారు. ఇందుకు పీసీబీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో 4 నెలలగా ఇక్కడి క్వారీల్లోకి సాగర్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20వేల టన్నుల వ్యర్థాలను క్వారీల్లో నింపారు. స్థానికుల కన్నెర్రతో... డంప్ సైట్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సాగర్ వ్యర్థాలను క్వారీల్లో నింపుతున్నారంటూ స్థానికులు అభ్యంతరం పెట్టారు. భారీ వర్షాలకు అది కరిగిపోయి సమీపంలోని కుంటలు, జలాశయాల్లోకి చేరుతుందని, పంట భూములు కూడా విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందని ఆక్షేపిస్తూ పీసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ అధికారులు గాజులరామారంలోని డంప్ సైట్‌ను సందర్శించి తాము నిర్దేశించిన నియమాలు అతిక్రమించినట్టు గుర్తించారు. ‘ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా శివారు ప్రాంతంలోని నీటి కుంటలు, భూములను విషతుల్యం చేస్తారా..? పశుపక్ష్యాదులతో పాటు ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్టదా..? నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా ‘సాగర్’ వ్యర్థాలను క్వారీల్లో డంప్ చేయడం ఎంతవరకు సమంజసం’ అంటూ పీసీబీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం డంప్ సైట్ నుంచి వ్యర్థాలు కిందికి జారిపోకుండా చుట్టూ ‘క్లే లైనింగ్’ ఏర్పాటు చేయడంతో పాటు సైడ్‌వాల్‌కు 90 సెం.మీ.ల మందంతో హెచ్డీపీఈ షీట్ లైనర్ను వేయాలి. అయితే... హెచ్ఎండీఏ అధికారులు క్వారీలో కేవలం 15 సెం.మీ. మందం ఉన్న హెచ్‌డీపీ షీట్‌ను మాత్రమే వేశారు. దీంతో నిర్దేశిత నియమాలను అతిక్రమించారని పీసీబీ ఆక్షేపిస్తూ వ్యర్థాల డంపింగ్‌ను నిలిపివేయాలని హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. ఫలితంగా సాగర్ నుంచి వెలికి తీసిన వ్యర్థాలను గాజులరామారం డంప్ సైట్‌కు తరలించే కార్యక్రమానికి పూర్తిగా బ్రేక్ పడింది. ఇక్కడి నుంచి ఒక్కలారీ వ్యర్థాలను తరలించాలన్నా పీసీబీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సాగర్ ప్రక్షాళన ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అది ఒండ్రు మట్టేనట.. ప్రస్తుతం పికెట్ నాలా వద్ద వెలికి తీసిన వ్యర్థాలు ఒండ్రు మట్టి (సెడిమెంట్) అని, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని, కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని హెచ్ఎండీఏ అధికారులు వాదిస్తున్నారు. నిజానికి పంటభూముల్లో ఎరువుగా ఉపయోగపడే ఈ సెడిమెంట్ వల్ల భూములు గాని, నీటికుంటలు గాని విషతుల్యం కావని, ఆ విషయాన్ని పీసీబీయే నిర్ధరించి తమకు అనుమతి ఇచ్చిందంటున్నారు. వాస్తవానికి ఒండ్రుమట్టి నింపే క్వారీ వద్ద లైనింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నది, భూమిలోకి ఇంకకుండా అడుగున బెడ్ వద్ద 90 సెం.మీ. మందంతో లైనర్ ఏర్పాటు చే శామని, సైడ్ వాల్స్‌కు 15 సెం.మీ. మందంతో హెచ్డీపీఈ షీట్ ఏర్పాటు చే శామని చెబుతున్నారు. తాము తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ వివరిస్తూ పీసీబీకి లేఖ కూడా రాశామని అధికారులు తెలిపారు. -
జలాశయాలు కళకళ
సాక్షి, సిటీబ్యూరో: వరుణుడు కరుణించడంతో గ్రేటర్ దాహార్తిని తీర్చే జలాశయాలు కళకళలాడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే జంటజలాశయాలు మినహా.. సింగూరు, మంజీరా, అక్కంపల్లి, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. నాగార్జునసాగర్, మంజీరా జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టం సంతరించుకోగా, సింగూరు, అక్కంపల్లి జలాశయాల్లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోతో మరికొద్ది రోజుల్లో నిండుకుండలుగా మారడం తథ్యమని జలమండలి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు మా త్రం ఇప్పటివరకు గరిష్ట మట్టాన్ని చేరుకోకపోవడం గమనార్హం. ఎగువ ప్రాంతాల్లోని ఆక్రమణలు, ఇసు క, మట్టి తవ్వకాలు, అక్రమ నిర్మాణాల కారణంగానే ఈ జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో రావ డం లేదని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నగర అవసరాలకు ఓకే నగర తాగునీటి అవసరాలకు మరో ఏడాది పాటు (365రోజులు) ఢోకాలేదని జలమండలి వర్గాలు తెలిపాయి. కాగా గండిపేట్ (ఉస్మాన్‌సాగర్) జలాశయం నిల్వలు 270 రోజులు, హిమాయత్‌సాగర్‌లోని నీటి నిల్వలు 221 రోజులపాటు నగర అవసరాలకు సరిపోతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల నుంచి రోజువారీగా 20 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తున్న విషయం విదితమే. ఇక సింగూరు గరిష్ట మట్టం 1717.850 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం1713.010 అడుగులకు చేరుకుంది. మంజీరా గరిష్ట మట్టం 1651.750 అడుగులు కాగా..ప్రస్తుతం పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకుంది. ఈ రెండు జలాశయాల నుంచి నిత్యం 100 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తున్నారు. అక్కంపల్లి గరిష్ట మట్టం 245 మీటర్లు కాగా ఈ జలాశయం ప్రస్తుతం 240.200 మీటర్ల నీటిమట్టంతో కళకళలాడుతోంది. నాగార్జున సాగర్‌లోనూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదనీటితో పూర్తిస్థాయిలో నిండింది. కాగా అక్కంపల్లి నుంచి రోజువారీగా కృష్ణా మొదటి, రెండవ దశల ద్వారా రోజువారీగా 180 మిలియన్ గ్యాలన్ల నీటిని మహా నగరానికి తరలిస్తున్నారు. మొత్తంగా ఆయా జలాశయాల నుంచి నగరానికి 300 మిలియన్ గ్యాలన్ల నీటిని గ్రేటర్‌కు తరలిస్తున్న విషయం విదితమే.