హిమాయత్‌ సాగర్‌కు లీకేజీలు | leakages to Himayat Sagar | Sakshi
Sakshi News home page

హిమాయత్‌సాగర్‌కు లీకేజీలు

Published Wed, Sep 3 2014 1:27 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

హిమాయత్‌ సాగర్‌కు లీకేజీలు - Sakshi

హిమాయత్‌ సాగర్‌కు లీకేజీలు

హిమాయత్‌ సాగర్‌లోకి చేరిన వరదనీరు వృథాగా పోతోంది. లీకేజీల కారణంగా 17 వరద గేట్ల నుంచి నీరంతా కిందికి వెళ్తోంది.

రాజేంద్రనగర్:  హిమాయత్‌సాగర్‌లోకి చేరిన వరదనీరు వృథాగా పోతోంది. లీకేజీల కారణంగా 17 వరద గేట్ల నుంచి నీరంతా కిందికి వెళ్తోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువప్రాంతం నుంచి హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు చేరింది.
 
ఈ నీరు రానున్న వేసవికాలం వరకు నగర వాసుల దాహార్తిని తీర్చనుంది. అయితే లీకేజీల కారణంగా గేట్ల నుంచి నీరంతా వృథాగా వెళ్తోంది. వరద గేట్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించకపోడంతో ఈ పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయంత్రానికి హిమాయత్‌సాగర్ నీటిమట్టం 1,755.5 అడుగులు, గండిపేట్ జలాశయం నీటిమట్టం 1,772 అడుగులుగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement