రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్, కిస్మత్‌పూర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌పై బుధవారం సాయంత్రం ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు.
రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్, కిస్మత్‌పూర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌పై బుధవారం సాయంత్రం ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. సురేశ్, బాదం అనే వ్యక్తులు కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్వాపెన్, కిండ్లీ పేర్లతో వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, వాటర్ క్యాన్లతోపాటు ఫిల్టర్లను సీజ్ చేసి నిర్వాహకులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.