
మృతుని బంధువుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని వాసవీ ఆస్పత్రి ముందు మృతుని బంధువులు ఆదివారం ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని దేవురపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మచారి(35) అనే వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఐదు రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
అతను చికిత్సపొందుతూ రెండు రోజుల క్రితమే చనిపోయినా.. ఆసుపత్రి సిబ్బంది ఆదివారమే మృతిచెందినట్లు చెబుతున్నారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.