Brahmachari
-
పెళ్లికాని ప్రసాదుల పాట్లు.. వధువు కావాలంటూ పాదయాత్ర!
ఇంత వరకు రాజకీయనాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. అలాగే ఏదైన అన్యాయం జరిగితే నిరసన తెలిపేందుకు కూడా పాదయాత్రలు చేపడుతుంటారు. కానీ ఇక్కడ పెళ్లి కోసం పాదయాత్ర చేపట్టారు కొంతమంది యువకులు. ఈ వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మాండ్యలో అబ్బాయిలు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారంతా తమకు మంచి అమ్మాయి దొరకాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పెళ్లికాని బ్రహ్మచారులు. అందుకోసం సుమారు 200 మంది బ్రహ్మచారులు మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టానున్నారు. తమకు పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి దొరికేలా ఆ దేవతా ఆశీర్వదం పొందడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని చెబుతున్నారు ఆ బ్యాచిలర్స్. ఐతే గతంలో ఈ జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని, దీనికి ఇప్పుడూ ఆ యువకులంతా తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ఓ మహిళా రైతు నాయకురాలు చెబుతోంది. మైసూరుకి 40 కి.మీ దూరంలో ఉన్న మాండ్య జిల్లాలో వధువుల కొరత బాగా ఎక్కువగా ఉందని, ప్రధానంగా వ్యవసాయ సంబంధిత పనులు చేసే యవతకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 23 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. ఈ పాదయాత్రో 30 ఏళ్లు పైబడిన 200 మంది యువకులంతా పాల్గొంటారు. అంతేగాదు ఈ పాదయాత్రకు బ్రహ్మచారుల పాదయాత్ర(బ్యాచిలర్ యాత్ర) అని కూడా పేరు పెట్టేశారు. ఈ యాత్రను ప్రకటించి పది రోజుల్లోనే సుమారు 100 మంది దాక పెళ్లికాని యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ యాత్ర ఫిబ్రవరి 23న మద్దూరు తాలూకాలోని కేఎం దొడ్డి గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో పాదయాత్ర 105 కి.మీ మేర సాగి ఫిబ్రవరి 25న ఎం.ఎం.హిల్స్‌కు చేరుకుంటుందని, యాత్రికులకు భోజన వసతి కూడా కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లి కాని యువకులను ఈ సమస్య నుంచి బయటపడేలా చేయాలన్న ఉద్దేశంతోనే తమ వంతుగా ఇలా సాయం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. (చదవండి: ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్..ఏకంగా రూ. 20 లక్షల జరిమానా) -
పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క.. "బ్రహ్మచారి" ట్రైలర్..
దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి దొరకక తను ఎలాంటి ఇబ్బంది పడ్డాడు అనేదే ఈ "బ్రహ్మచారి" కథ. పొడిచేటి మూవీ మేకర్స్ పతాకంపై వెండితెరకు దర్శకుడుగా పరిచయం కాబోతున్న కొత్త కెరటం నర్సింగ్ దర్శకత్వంలో నూతన నటీనటులతో రమేష్ మాస్టర్ శ్రీ కిరణ్, విగ్నేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం "బ్రహ్మచారి'".ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ కె బసి రెడ్డి గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ , ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు లయన్ డాక్టర్ సాయి వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ..మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వయసు పైబడ్డ వాళ్ళు డబ్బులున్నా, ఎంత ఇబ్బంది పడతారో కామెడీ గా చెప్పాలనుకున్నాను. ఇందులో నేను ఎదుర్కున్న అనుభవాలు కూడా ఉండవచ్చు.నిజ జీవితం లో ఎదురయ్యే సంఘటనలతో ఈ "బ్రాహ్మ చారి" సినిమా తియ్యడం జరిగింది. అన్నారు. -
అయ్యప్ప బ్రహ్మచర్యానికి రాజ్యాంగ రక్షణ
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ ప్రధాన దైవం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయని నాయర్ సర్వీస్ సొసైటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈ సొసైటీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ సంస్థ తరఫు లాయర్ కె.పరాశరన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ ఆలయంలోకి వచ్చే వారు యువతులు, మహిళలను వెంట తీసుకురావొద్దు. పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు వర్తించదు’ అని పరాశరన్ అన్నారు. మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని బెంచ్ ప్రశ్నించగా..చాలా ఏళ్ల నాటి ఇలాంటి సంప్రదాయాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని బదులిచ్చారు. వాదనలు నేడు కూడా కొనసాగనున్నాయి. దివ్యాంగుల సౌకర్యం పట్టదా? రవాణా సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాల్లో దివ్యాంగులకు అనుకూలంగా మార్పులు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గత డిసెంబర్లో తాము జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన కేంద్రానికి చీవాట్లు పెట్టింది. ఇప్పటి దాకా తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలుచేయాలని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల తీరుపై కూడా బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. -
నల్గొండ జిల్లాలోనూ నయీం అరాచకాలు
-
‘ప్రాణం పోయినా... వైద్యం చేశారు!’
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రాణం పోయిన తర్వాత కూడా చికిత్స అందించారంటూ ఓ మృతుడి బంధువులు ఖైరతాబాద్‌లోని ఓ ఆస్పత్రి ముందు ఆదివారం ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన వి.బ్రహ్మాచారి(35) ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యసేవల కోసం నగరానికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో 7వ తేదీ ఉదయం ఖైరతాబాద్‌లోని వాసవి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పరీక్షించిన డాక్టర్లు కడుపులో పేగు తెగిపోయిందని చెప్పి అదే రోజు సాయంత్రం శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఆ తరువాత ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మచారి పరిస్థితి విషమించి చనిపోయినట్లు వైద్యులు ఆదివారం తెల్లవారుజామున బంధువులకు తెలియజేశారు. ధర్నాకు దిగిన రోగి బంధువులు...... అయితే, బ్రహ్మాచారి చనిపోయి రెండు రోజులైనా తమకు చెప్పకుండా చికిత్స అందిస్తూ వచ్చారంటూ రోగి బంధువులు ఆదివారం మధ్యాహ్నం హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ మృతుడి తమ్ముడు చంద్రశేఖర్‌తో పాటు బంధువులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు, హాస్పిటల్ యాజమాన్యం సర్దిచెప్పడంతో బాధితులు మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. అయితే, రోగిని కాపాడేందుకు పూర్తిస్థాయిలో డాక్టర్లు ప్రయత్నించారని, చనిపోయిన తరువాత చికిత్స నిర్వహించామని చెప్తున్న విషయంలో వాస్తవం లేదని వాసవి హాస్పిటల్ మేనేజర్ నాగేశ్వర్రావు తెలిపారు. -
మృతుని బంధువుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని వాసవీ ఆస్పత్రి ముందు మృతుని బంధువులు ఆదివారం ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని దేవురపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మచారి(35) అనే వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఐదు రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అతను చికిత్సపొందుతూ రెండు రోజుల క్రితమే చనిపోయినా.. ఆసుపత్రి సిబ్బంది ఆదివారమే మృతిచెందినట్లు చెబుతున్నారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
కాపీ కొట్టినా కమల్‌దే పై చేయి!
ఆ సీన్ - ఈ సీన్ కమల్‌హాసన్‌ని విశ్వనాయకుడు అంటారు. కేవలం తన స్టార్‌డమ్‌తోనే కాదు, యూనివర్సలోని ఎక్కడెక్కడి సినిమాలనో కాపీ చేయడం ద్వారా కూడా ఆయన తన బిరుదును జస్టిఫై చేస్తుంటా డేమో అనిపిస్తుంది ఒక్కోసారి! కమల్ సినిమాల్లో కాపీలు చాలానే ఉన్నాయి. వాటిలో ‘బ్రహ్మచారి’ ఒకటి. కమల్ సన్నిహితుడైన రచయిత క్రేజీమోహన్ ఈ బ్రహ్మచారి సృష్టికర్త. అయితే ఈ క్రియేషన్‌లో అమెరికన్ బ్రహ్మచారిని ఫాలో అయ్యాడాయన. ఒక మిలియనీర్‌కి వారసుడు జిమ్మీ షానన్. తన ఫ్రెండ్సతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ నడుపుతూ... ఇంటికి దూరంగా బతుకుతూ ఉంటాడు. ఇతగాడు మొదట ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే తన స్నేహితులందరి వైవాహిక జీవితాలూ విఫలమవడం చూసి పెళ్లిపై అయిష్టతను పెంచుకుంటాడు. ప్రేయసికి దూరమవు తాడు. జిమ్మీకి వివాహం చేయాలని తపిస్తూ ఉంటారు ఇంట్లోవాళ్లు. ఒక సంబంధం చూస్తే దాన్ని కూడా జిమ్మీ తిరస్కరిస్తాడు. అంతలో జిమ్మీ తాతయ్య.. పెళ్లి చేసుకుంటేనే జిమ్మీకి ఆస్తి దక్కు తుందని, లేకపోతే ప్రభుత్వానికి స్వాధీనం అవుతుందనే క్లాజ్‌తో చిత్రమైన వీలునామా రాసి మరణిస్తాడు. పెళ్లికి అతి తక్కువ సమయాన్ని గడువుగా పెడతాడు. దాంతో ఆస్తిని దక్కించుకోవడం కోసమైనా వివాహం చేసుకోవాలని తన మాజీ ప్రేయసి దగ్గరకు వెళ్తాడు జిమ్. కానీ మిస్ కమ్యూనికేషన్ వల్ల ఒకరినొకరు అపార్థం చేసుకుని దూరమవుతారు. అక్కడి నుంచి హీరో కష్టాలు మరింత తీవ్రం అవుతాయి. గడువులోగా పెళ్లి చేసుకోవడానికి, అందులోనూ తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అతడు పడే పాట్లే ‘ద బ్యాచిలర్’ సినిమా మిగతా కథ. 1999లో వచ్చిన ఈ చిత్రానికి, 2002లో వచ్చిన ‘బ్రహ్మచారి’ సినిమాను కార్బన్ కాపీ అనలేం. అలా అని కాపీ కాదనీ అనలేం. అవకాశం ఉన్న చోట మార్పులు చేసుకుంటూ సినిమాకు కొత్తదనాన్ని అద్దారు. రెండు సినిమాల మధ్య ప్రధాన పోలికలన్నీ మలుపుల వద్ద కనిపిస్తాయి. ఆంగ్ల సినిమా నుంచి థీమ్ పాయింట్‌ను తీసుకున్న కమల్ హాసన్ అండ్ కో... తమ సినిమాకు కొత్త తరహా ట్రీట్మెంట్ను ఇచ్చారు. పెంటపాడు కల్యాణ సంబంధం (పీకేఎస్) కు పెళ్లంటే విరక్తి. ఇతడి గ్యాంగ్‌లో మెంబర్ అయిన అబ్బాస్‌కు పెళ్లి చేశాక అతడి వైవాహిక జీవితంలో కలతలు రేగడంతో వివాహం అంటే మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఇంట్లోవాళ్లు బంధువులమ్మా యిని పెళ్లి చేసుకొమ్మని కోరతారు. సంబంధం దాన్ని తిరస్కరిస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఒక గడువును పెట్టి, ఆ లోపు వివాహం చేసుకోకపోతే సంబంధం అధీనంలో ఉండే లాడ్జి కులసంఘానికి చెందేటట్టు వీలునామా రాస్తాడు వాళ్ల తాతయ్య. ఆ విషయం తెలిసిన సంబంధం అప్పటికే తనకు పరిచయమైన జానకిని (సిమ్రాన్) పెళ్లాడాలనుకుంటాడు. అది కుదరదని అర్థమై, బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతాడు. తీరా పెళ్లికి అంతా రెడీ అనుకున్నాక హీరోయిన్ మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. హీరోని పెళ్లాడతానని అంటుంది. ఆ తర్వాత కామెడీ ట్విస్టులతో సంబంధం వాళ్ల తాతయ్య పెట్టిన షరతుకు లోబడి లాడ్జిని సొంతం చేసుకుంటాడు. కథ, కథనాల్లో ఎలాంటి మార్పులూ ఉండవు, మిగతా విషయాల్లో ఎక్కడా పోలికలు ఉండవు అన్నట్టుగా ఉంటుంది ఈ రెండు సినిమాల పరిస్థితి. హీరోని అంజనేయస్వామి భక్తుడిగా చూపించి అందుకే అతడు పెళ్లిని ఇష్టపడటం లేదని చెప్పి సినిమాను లోకలైజ్ చేశారు. ప్రీ లవ్‌స్టోరీ అవసరం లేకుండా చేసుకున్నారు ఈ ఎత్తుగడ ద్వారా. అక్కడి నుంచి క్యారెక్టర్ల మధ్య కన్ఫ్యూజన్ను క్రియేట్ చేసి నవ్వుల్లో ముంచెత్తతూ ‘బ్రహ్మచారి’ పరుగులు పెడతాడు. మన పొట్టలు పగిలేలా చేస్తాడు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య పరిచయ సన్నివేశాలు... అబ్బాస్, స్నేహ క్యారెక్టర్ల మధ్య సీన్లను కొత్తగా క్రియేట్ చేసి తమ మార్కును చూపించారు రచయితలు. కానీ దర్శకుడు మౌళి ఈ సినిమాను ఎంతగా పక్కకు లాగినా ఓవరాల్‌గా ‘ద బ్యాచిలర్’ రూట్లోనే నడుస్తుంది. అయితే కామెడీ మాత్రం పీక్స్‌లో ఉంటుంది. కమల్ నటన పతాకస్థాయిలో ఉంటుంది. ఓపక్క నవ్విస్తూనే... హీరోయిన్ తన ప్రేమకు నో చెప్పినప్పుడు, తాతయ్య చనిపోయి నప్పుడు కన్నీళ్లు పొంగిస్తాడు కమల్. గుండెల్ని పిండేస్తాడు. కాపీ సినిమాని సైతం తన తరహాలో రక్తి కట్టించాడు. దాన్ని బట్టి కాపీ కొట్టినా కమల్‌దే పై చేయి అనుకోవాలి! - బి.జీవన్‌రెడ్డి