ఆసుపత్రి నాలుగు నెలలుగా జీతాలివ్వకపోవడంతో ఉద్యోగులు మంగళవారం ధర్నాకు దిగారు.
హైదరాబాద్: నగరంలోని ఓ ఆసుపత్రి నాలుగు నెలలుగా జీతాలివ్వకపోవడంతో ఉద్యోగులు మంగళవారం ధర్నాకు దిగారు. గచ్చిబౌలిలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందికి యాజమాన్యం గత నాలుగు నెలలుగా జీతాలివ్వడం లేదు.
దీంతో 20 మంది సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలిపారు.