సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఈయన పేరు ఉమాశంకర్. మెదక్ జిల్లా, కొడపాక గ్రామం స్వస్థలం. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కూలి పనులకెళ్లి పిల్లలను చదివించింది. ఉమాశంకర్, అక్క సంతోషి, తల్లితో కలిసి బదుకుదెరువుకోసం నగరానికి వచ్చాడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. తల్లి, అక్కతో కలిసి సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో నివాసం ఉంటున్నారు.
ఉమాశంకర్ మూడు నెలల క్రితం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయం సమీపంలో లారీ ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. యశోద ఆస్పత్రిలో చేర్పి చికిత్స చేశారు. ఇప్పటికే ఒకసారి సర్జరీ కూడా అయింది. కానీ ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. తలలో నరాలు చిట్లిపోయాయని, ఇందుకు మరోసారి సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
ఇందుకు మరో రూ.ఐదు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఆస్తులన్నీ అమ్మి రూ.ఏడు లక్షల వరకు బాధితుని బంధువు లు చెల్లించారు. ప్రస్తుతం ఆయన వద్ద పైసా కూడా లేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేని స్థితి. ఎవరైనా దాతలు సహాయం చేస్తే తన సోదరుడిని కాపాడుకుంటామని సంతోషిణి వేడుకుంటోంది. సాయం చేయదలచిన దాతలు 95059 82448, 99081 31499 నంబర్లలో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment