కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! | Jamshedpur Road Accident: 6 People Died On First Day Of New Year | Sakshi
Sakshi News home page

Jan 1 2024 11:23 AM | Updated on Jan 1 2024 11:31 AM

Jamshedpur Road Accident on New Year First Day - Sakshi

జార్ఖండ్‌లో నూతన సంవత్సరం 2024 తొలిరోజునే విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపుతప్పిన ఒక కారు డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 
 

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరొకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆయా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement