
గండిపేట.. జల(న) కళ
గండిపేట జలకళను సంతరించుకుంది భారీ ఎత్తున వరద నీరు చేరడంతో చెరువుకు పూర్వవైభవం వచ్చింది.
మణికొండ: గండిపేట(ఉస్మాన్‌సాగర్) జలకళను సంతరించుకుంది. ఇటీవల వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు చేరడంతో చెరువుకు పూర్వవైభవం వచ్చింది. దీంతో సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో చెరువును తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారు. జలకళతో పాటు జనకళ సంతరించుకోవడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లలో ఇంత పెద్ద ఎత్తున జనం రావడం ఇదే మొదటిసారి అని పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది.