పిల్లల ముందు ఉపాధ్యాయుల వాగ్వాదం | Altercation Between School Teachers In Gandipet ZP School | Sakshi
Sakshi News home page

పిల్లల ముందు ఉపాధ్యాయుల వాగ్వాదం

Published Mon, Jul 1 2019 9:14 PM | Last Updated on Mon, Jul 1 2019 9:16 PM

Altercation Between School Teachers In Gandipet ZP School - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటన గండిపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయురాలు మనోరమ, హెడ్‌ మాస్టర్‌ రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పాఠశాలలో పిల్లల ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా బూతులు తిట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు సెల్‌ఫోన్‌ విసురుకున్నారు. ఆ తర్వాత మనోరమ హెడ్‌ మాస్టర్‌పై నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement